- Telugu News Photo Gallery If the Laughing Buddha is placed in this direction in the house, will it bring good luck?
Laughing Buddha: లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఏ దిక్కులో ఉంచితే.. అదృష్టం వరిస్తుంది!
లాఫింగ్ బుద్ధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లాఫింగ్ బుద్ధా గురించి అందరికీ తెలుసు. చాలా మంది ఇళ్లలో లాఫింగ్ బుద్ధా అనేది ఖచ్చితంగా ఉంటుంది. లాఫింగ్ బుద్ధాను పది సెకన్ల పాటు అలాగే చూస్తే.. నవ్వడం ఖాయం. అంతే కాకుండా ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో సరైన దిక్కులో ఉంచాలి. లేదంటే వ్యతిరేక ఫలితాలు..
Updated on: May 22, 2024 | 6:55 PM

లాఫింగ్ బుద్ధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లాఫింగ్ బుద్ధా గురించి అందరికీ తెలుసు. చాలా మంది ఇళ్లలో లాఫింగ్ బుద్ధా అనేది ఖచ్చితంగా ఉంటుంది. లాఫింగ్ బుద్ధాను పది సెకన్ల పాటు అలాగే చూస్తే.. నవ్వడం ఖాయం. అంతే కాకుండా ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి.

లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో సరైన దిక్కులో ఉంచాలి. లేదంటే వ్యతిరేక ఫలితాలు కూడా చూపిస్తుంది. ఈ విగ్రహాన్ని గిఫ్ట్‌గా ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్. ఈ విగ్రహాన్ని మీకు మీరే స్వయంగా కొనుక్కోకూడదు.

మీ ఇంట్లో తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధా ను ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అనేవి తగ్గుతాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకుంటుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

అదే విధంగా ఇంట్లో పడమర దిక్కులో ఉంచితే.. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచితే.. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. డబ్బులకు కొరత అనేది ఉండదు.

సంతానం కలగాలి అనుకున్నవారు పిల్లలతో కలిసి నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచుకోవాలి. అదే విధంగా కిచెన్‌లో, బాత్రూమ్‌లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని అస్సలు పెట్టకూడదు. అలాగే ఈ విగ్రహాన్ని ఎప్పుడూ కంటికి కనిపించే అంత ఎత్తులో ఉంచుకోవాలి.





























