చెప్పులు రిపేర్ చేస్తున్న వ్యక్తి రష్యన్ గర్ల్ సంభాషణ.. 7 కోట్ల మంది హృదయన్ని గెలుచుకున్న వీడియో

ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడాలంటే కావల్సింది కోచింగ్ సెంటర్లు, ఇంగ్లీష్ మీడియం చదువులు కాదు... ఆసక్తిని భాష నేర్చుకోవాలన్న తపన పట్టుదల చాలు అని నిరూపిస్తున్నాయి. గత కొన్ని నెలల క్రితం ఓ యువతి బీచ్ పూసల దండలు అమ్ముతూ ఇంగ్లీష్ లో ఒక్క తప్పు కూడా లేకుండా దంచేసింది. ఇటీవల కొచ్చికి చెందిన ఓ ఆటోడ్రైవర్ అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడి ఇంటర్నెట్‌లో వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ముంబై నుండి ఇలాంటి వీడియో వైరల్ అయ్యింది. దీనిలో ఒక చెప్పులు కుట్టే వ్యక్తి అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడటం ద్వారా రష్యన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఆశ్చర్యపరిచాడు.

చెప్పులు రిపేర్ చేస్తున్న వ్యక్తి రష్యన్ గర్ల్ సంభాషణ.. 7 కోట్ల మంది హృదయన్ని గెలుచుకున్న వీడియో
Mochi Helped A Russian Women
Follow us
Surya Kala

|

Updated on: May 22, 2024 | 4:05 PM

ప్రస్తుతం మాతృ భాషకంటే ఇంగ్లీషు మాట్లాడంలోనే అందరికి ఆసక్తి.. తమ పిల్లలు ఇంగ్లీషులోనే మాట్లాడాలని ఆర్ధిక శక్తి మించి ఫీజులు కట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే వీడియోలు కూడా ఎన్నో నెట్టింట్లో చక్కర్లు కొడుతూ.. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడాలంటే కావల్సింది కోచింగ్ సెంటర్లు, ఇంగ్లీష్ మీడియం చదువులు కాదు… ఆసక్తిని భాష నేర్చుకోవాలన్న తపన పట్టుదల చాలు అని నిరూపిస్తున్నాయి. గత కొన్ని నెలల క్రితం ఓ యువతి బీచ్ పూసల దండలు అమ్ముతూ ఇంగ్లీష్ లో ఒక్క తప్పు కూడా లేకుండా దంచేసింది. ఇటీవల కొచ్చికి చెందిన ఓ ఆటోడ్రైవర్ అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడి ఇంటర్నెట్‌లో వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ముంబై నుండి ఇలాంటి వీడియో వైరల్ అయ్యింది. దీనిలో ఒక చెప్పులు కుట్టే వ్యక్తి అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడటం ద్వారా రష్యన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఆశ్చర్యపరిచాడు. మరియా చుగురోవా భారతదేశ పర్యటనలో ఉంది. మాయానగరిలో తిరుగుతుండగా చెప్పులు తెగిపోయాయి. దీంతో ఆమె తన చెప్పులను కుట్టించుకోడానికి చెప్పులు కుట్టే అతని దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఆమెకు భాషతో ఇబ్బంది రాకుంగా అతను ఇంగ్లీష్ లో మాట్లాడిన విధానం విని ఆమె చలించిపోయింది. మరియా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేసింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక రష్యన్ మహిళ వికాస్ అనే చెప్పులు కుట్టే వ్యక్తి దుకాణం వద్దకు తెగిన చెప్పుతో చేరుకోవడం మీరు చూడవచ్చు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో వికాస్ తాను గత 26 సంవత్సరాలుగా చెప్పులు కుట్టే వృత్తిని చేస్తున్నట్లు పని చేస్తున్నానని మరియాతో చెప్పాడు. అయితే ఆ యువతి మొదట్లో హిందీ లో మాట్లాడినా.. ఆ ప్రశ్నలకు వికాష్ ఇంగ్లీషులో సమాధానం చెప్పాడు. అంతేకాదు వికాష్ తో రష్యన్ గర్ల్ మా దేశంలో ఇలా చెప్పులు కుట్టే సదుపాయం ఉండదు.. తెగిన చెప్పులతోనే వెళ్ళాలి అంటూ చెప్పింది. డబ్బులు ఎంత అని అడిగితే వికాష్ చెప్పుల మరమ్మతుకు రూ.10 మాత్రమే చార్జ్ చేశాడు. దీంతో నెటిజన్లు ఇంత తక్కువా అంటూ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని తరువాత మరియా ప్రేమతో చెప్పులు కుట్టే వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరియా తన ఇన్‌స్టా ఖాతాలో వీడియోను పంచుకుంది. కష్ట సమయాల్లో చెప్పులు వ్యక్తి రష్యన్ కి సహాయం చేశాడు. నా నమ్మకమైన స్లిప్పర్ నాకు ద్రోహం చేసింది.. అయితే సూపర్ హీరో చెప్పులు కుట్టే వ్యక్తి నన్ను రక్షించాడు. దీంతో నా చెప్పులు మునుపటి కంటే బలంగా తిరిగి వచ్చాయి అంటూ కామెంట్ జత చేసింది ఈ వీడియోకు

ఇక్కడ వీడియో చూడండి

ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 7 కోట్ల వ్యూస్ రాగా.. చాలా మంది యూజర్లు కామెంట్ చేశారు. చాలా మంది వినియోగదారులు వికాష్ ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యానికి ముగ్ధులయ్యారు, మరికొందరు అతని నిజాయితీని ప్రశంసిస్తున్నారు. ఒకరు వ్యాఖ్యానించారు మరియా చెప్పులు కుట్టినందుకు థాంక్స్ చెప్పిన విధానంతో ఆమె హృదయాలను గెలుచుకుంది. అయితే, మరొకరు రాశారు.. ఈ దుకాణం దాదర్‌లో ఉందని.. అంకుల్ ఇంగ్లీష్ సుపర్బ్ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!