ఎడారి ఇసుకలో పాపడ్ కాల్చిన బీఎస్ఎఫ్ జవాన్!.. వైరలవుతున్న వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

మరోవైపు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డివిజనల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, సబ్‌డివిజన్ అధికారులు, నీటి సరఫరా, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. విద్యుత్ సంస్థల అధికారులు, ఉద్యోగుల సెలవులు కూడా రద్దు చేశారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఉండాలని కోరారు.

ఎడారి ఇసుకలో పాపడ్ కాల్చిన బీఎస్ఎఫ్ జవాన్!.. వైరలవుతున్న వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Roasts Papad In The Sand
Follow us

|

Updated on: May 22, 2024 | 3:31 PM

రాజస్థాన్‌లో మండుతున్న ఎండ వేడిమి కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎండ వేడిమి, కరెంటు కోతలతో ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇక్కడి ఎండలకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది. బుధవారం, పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న BSF సరిహద్దు అవుట్‌పోస్టుల వద్ద మధ్యాహ్నం 48 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలోనే సరిహద్దు భద్రతా దళం (BSF) సైనికుడు వేడి ఇసుకపై పాపడ్ కాల్చడం కనిపించింది. ఇసుక చాలా వేడిగా ఉంది. అందులో ఉంచిన పాపడ్ కొన్ని సెకన్లలో ఉడికిపోయింది. అస్సాం సీఎం శర్మ ఈ వీడియోను పోస్ట్ చేసి దానికి భావోద్వేగ క్యాప్షన్‌ రాశారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ వీడియోను తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజస్థాన్ ఎడారి బికనీర్ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మధ్య ఉంటోంది. అక్కడే అంత ఎండలో గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ ఎడారి ఇసుకలో పాపడ్ ను ఉంచాడు. 30 సెకన్ల తర్వాత తీసి చూస్తే ఆ పాపడ్ పూర్తిగా కాలి తినడానికి రెడీ అయిపోయింది. దానిని తీసి నలిపి చూపించాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో జవాన్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. జవాన్లకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, ‘రాజస్థాన్ ఎడారిలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయి. అటువంటి అసాధారణ పరిస్థితులలో కూడా మన జవాన్లు ఎండలో గస్తీ కాస్తున్నందునే మనం ఇంత చల్లగా ఏసీలో బ్రతుకుతున్నామని పలువురు వ్యాఖ్యనించారు. దేశం కోసం ఎండను, చలిని లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి కాపాలా కాస్తున్న జవాన్లకు ధన్యవాదాలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్‌లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలోని జుంజును జిల్లా పిలానీలో వరుసగా రెండో రోజు బుధవారం కూడా ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆదేశాల మేరకు డివిజనల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, సబ్‌డివిజన్ అధికారులు, నీటి సరఫరా, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. విద్యుత్ సంస్థల అధికారులు, ఉద్యోగుల సెలవులు కూడా రద్దు చేశారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఉండాలని కోరారు. ప్రభుత్వ సూచనల మేరకు అన్ని స్థానిక సంస్థలు నగరాల్లో స్ప్రేయింగ్ చేస్తూ ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!