Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాల్లో ప్రాణాలు! వంతెనపై వేలాడుతున్న బస్సు.. వైరల్‌గా మారిన ఫోటోలు..ఎక్కడంటే..

బస్సు గాలిలో వేలాడుతూ కనిపించిన తీరు, దాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెరుగుతున్న ప్రమాదాలపై సోషల్ మీడియా యూజర్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేకుండా డ్రైవింగ్ చేయడం లేదని, ఇది కూడా ప్రమాదాలు పెరగడానికి కారణమని ఒకరు రాశారు. మంచి రహదారుల నిర్మాణం వల్ల ప్రజలు అతివేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఒకరు రాశారు.

గాల్లో ప్రాణాలు! వంతెనపై వేలాడుతున్న బస్సు.. వైరల్‌గా మారిన ఫోటోలు..ఎక్కడంటే..
Ksrtc Bus Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: May 21, 2024 | 9:25 PM

రోడ్డుపై ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీని వెనుక చాలా కారణాలున్నాయి. ఒక్కోసారి అతివేగం వల్ల, ఒక్కోసారి వాహనంలోని సాంకేతిక లోపం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. బెంగుళూరులో యాక్సిడెంట్ తర్వాత ఓ బస్సు గాలిలో వేలాడిన దృశ్యం ప్రయాణికులు, చూస్తున్న జనాలకు ఊపిరి ఆగిపోయేలా చేసింది. ఎత్తైన వంతెనపై గాల్లో వేలాడుతున్న బస్సు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందిన సమాచారం ప్రకారం మే 18న KSRTC బస్సు ప్రమాదానికి గురైంది. తుమకూరు రోడ్డులోని నెలమంగళ సమీపంలోని మాదనాయకనహళ్లి మీదుగా బస్సు వెళ్తుండగా డ్రైవర్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టడంతో బస్సు సగం గాలిలోకి వేలాడుతూ ఉండడంతో చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్‌తో పాటు ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అదృష్టవశాత్తూ బ్రిడ్జిపై నుంచి పడి ఎవరూ చనిపోలేదు. బస్సు వేలాడుతూ ఉండటంతో ప్రయాణికులంతా వెంటనే బస్సు నుంచి కిందకు దిగారు. ఈ బస్సుకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రమాదం జరిగిన తీరు.. ఒక కారు అకస్మాత్తుగా తన లేన్‌ను మార్చిందని, దాని కారణంగా డ్రైవర్ దానిని నివారించడానికి బస్సు దిశను మార్చవలసి వచ్చిందని తెలిసింది. దీంతో డ్రైవర్‌కు బస్సుపై అదుపు తప్పి ఇలాంటి ప్రమాదం జరిగింది. ప్రమాదం తరువాత, ప్రయాణికులందరినీ బస్సు నుండి సురక్షితంగా బయటకు తీయగా, కొంతమంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, బస్సు గాలిలో వేలాడుతూ కనిపించిన తీరు, దాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెరుగుతున్న ప్రమాదాలపై సోషల్ మీడియా యూజర్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేకుండా డ్రైవింగ్ చేయడం లేదని, ఇది కూడా ప్రమాదాలు పెరగడానికి కారణమని ఒకరు రాశారు. మంచి రహదారుల నిర్మాణం వల్ల ప్రజలు అతివేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఒకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..