Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh : కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లలకు రక్షణ కోరుతూ తల్లిదండ్రులు..

కిర్గిస్థాన్ లో భారత్ కు చెందిన విద్యార్థులు దాదాపు 14,500 మంది వరకు వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ఇక్కడ మెడిసిన్ చేయడానికి ఆరు సంవత్సరాలకు ఫీజు కేవలం 22 లక్షలు మాత్రమే ఉండటం, ఇక్కడ జీవన ప్రమాణాల వ్యయం కూడా చాలా తక్కువగా ఉండటంతో వైద్య విద్య ఇక్కడ చేసేందుకు మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. ఈ పరిస్థితుల్లోనే ఏపికి చెందిన విద్యార్థులు

Andhra Pradesh : కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లలకు రక్షణ కోరుతూ తల్లిదండ్రులు..
Indian Students In Kyrgyzst
Follow us
G Koteswara Rao

| Edited By: Jyothi Gadda

Updated on: May 21, 2024 | 8:00 PM

కిర్గిజిస్థాన్ రాజధాని బిస్కెక్ లో గత రెండు రోజులుగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు విజయనగరం జిల్లాలోని రాజాం పట్టణానికి చెందిన పలు కుటుంబాల్లో భయాందోళనకు దారితీశాయి. కర్గిజిస్థాన్ లో మెడిసిన్ చదువుతున్న భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విద్యార్థులు నివాసం ఉంటున్న హాస్టల్స్ పై స్థానిక విద్యార్థులు పెద్ద ఎత్తున దాడులకు తెగబడ్డారు. తమ దేశాన్ని వదిలి వెళ్లాలని ఆందోళనలకు దిగారు. ఈ దాడుల్లో పలువురు ఇతర దేశాల విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే భారత్ విద్యార్థులు నివాసం ఉంటున్న వసతి గృహాల పై సైతం స్థానిక విద్యార్థులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో విజయనగరం జిల్లా రాజాం కు చెందిన పలువురు మెడిసిన్ చదువుతున్న విద్యార్థుల హాస్టల్ గదుల పై కూడా దాడులకు పాల్పడ్డారు.

అయితే హాస్టల్ గది యొక్క తలుపులు తట్టి బయటికి రావాలని స్థానిక విద్యార్థులు హెచ్చరించినా విజయనగరం జిల్లా విద్యార్థులు మాత్రం భయంతో తలుపులు తీయలేదు. తమ హాస్టల్స్ పై జరుగుతున్న దాడులు ఎప్పటి వరకు జరుగుతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు విద్యార్థులు. అయితే బయట జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితి గురించి తెలియని పలువురు ఇతర దేశాల విద్యార్థులు తలుపులు తీయడంతో వారిని బయటకు లాక్కెళ్లి గొంతు కోసి హతమార్చారు స్థానిక విద్యార్థులు. కర్గిజిస్థాన్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొద్దిసేపట్లోనే ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో అన్ని దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. హుటాహుటీన ఆయా దేశాల ప్రతినిధులు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో తమ దేశాలకు చెందిన విద్యార్థులకు ఎలాంటి హానీ జరగటానికి వీల్లేదంటూ హెచ్చరించడంతో కిర్గిజిస్థాన్ ప్రభుత్వం చర్యలకు దిగింది. వెంటనే పెద్ద ఎత్తున బలగాల మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది.

అయితే అప్పటికే పెద్దఎత్తున ఆస్థి, ప్రాణనష్టం జరిగింది. అలా అక్కడ జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు మన రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థుల కుటుంబ సభ్యుల్లో తీవ్రభయాందోళనను రేకిత్తించాయి. తమ పిల్లలు ఎలా ఉన్నారో తెలియక అయోమయంలో భయాందోళనకు గురయ్యారు. పిల్లలు చెబుతున్న ఉద్రిక్త పరిస్థితులు తెలుసుకొని ఆందోళన చెందారు. తరువాత కొంతసేపటికి ప్రస్తుతానికి తామంతా బాగున్నామని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

కిర్గిస్థాన్ లో భారత్ కు చెందిన విద్యార్థులు దాదాపు 14,500 మంది వరకు వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ఇక్కడ మెడిసిన్ చేయడానికి ఆరు సంవత్సరాలకు ఫీజు కేవలం 22 లక్షలు మాత్రమే ఉండటం, ఇక్కడ జీవన ప్రమాణాల వ్యయం కూడా చాలా తక్కువగా ఉండటంతో వైద్య విద్య ఇక్కడ చేసేందుకు మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. ఈ పరిస్థితుల్లోనే ఏపికి చెందిన విద్యార్థులు కూడా పెద్దఎత్తున ఇక్కడ మెడిసిన్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జరిగిన పరిణామాలు మరోసారి జరగకుండా కటినమైన చర్యలు తీసుకొని తమ పిల్లలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు తల్లిదండ్రులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..