Rain Alert: చల్ల చల్లని కూల్ న్యూస్.. ఇక ఫుల్లుగా వర్షాలు.. ఐదు రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.
నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు ( మే 21 నుంచి 25 వరకు) తేలికపాటి నుంచి .. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది..
23 మే, బుధవారం: అల్పపీడనం ప్రభావంతో బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
23 మే, గురువారం: పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
24 మే, శుక్రవారం: అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
25 మే, శనివారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కాకినాడ, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ఉరుములతో కూడిన వర్షం కురిసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ఎండీ సూచించారు.
మంగళవారం వర్షపాతం ఇలా..
మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి అనంతపురం జిల్లా నార్పల 26.5 మిమీ, చిత్తూరులో 22.5మిమీ, అనంతపురం బికె సముద్రంలో 22 మిమీ, చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో 21.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం