ఓ మై గాడ్.. ఆవు తేనుపు.. గ్యాస్ నుంచి వజ్రాలు తయారీ.. రీజన్ వింటే శభాష్ అనాల్సిందే ఎవరైనా ..
టోనీ ఫాడెల్ ఆవు బర్ప్స్, వదిలే గ్యాస్ నుంచి విడుదలయ్యే మీథేన్ వాయువుని వజ్రాలుగా మారుస్తున్నాడు. బ్రాటిస్లావాలో జరిగిన స్టార్మస్ ఫెస్టివల్ సందర్భంగా అతను తన కొత్త ప్రయోగం గురించిన సమాచారాన్ని ప్రపంచం ముందు వెల్లడించినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. సంవత్సరాలుగా ఈ రోజు ప్రపంచం ఉపయోగిస్తున్న బిలియన్ల మరియు ట్రిలియన్ల ఉత్పత్తులను తయారు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నా ఈ ఉత్పత్తి భూమిని రక్షించడం కోసమని స్పష్టం చేశాడు.
మనిషి అవసరాలు గొప్ప ఆవిష్కరణలు చేసేలా చేస్తున్నాయి. మానవుడు భూమి నుంచి చంద్రునికి చేరుకుంటున్నారు.. సముద్ర లోతులను కొలుస్తున్నాడు. అయితే, చాలా సార్లు మనం మన అవసరాలకు అనుగుణంగా రకరకాల ఆవిష్కరణలు చేసారనే వార్త వింటే చాలు వాటి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతాం. ఇప్పుడు అలాంటి ఒక ఆవిష్కరణ నేట్టింట్లో చర్చకు వచ్చింది, ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.. ఎందుకంటే ఐపాడ్ ఆవిష్కర్త టోనీ ఫాడెల్ ఇప్పుడు ఆవు బర్ప్స్ ( ఆవు తేనుపుల )నుంచి వజ్రాలను సిద్ధం చేస్తున్నారు.
ఇంగ్లీష్ వెబ్‌సైట్ మెట్రో ప్రకారం టోనీ ఫాడెల్ ఆవు బర్ప్స్, వదిలే గ్యాస్ నుంచి విడుదలయ్యే మీథేన్ వాయువుని వజ్రాలుగా మారుస్తున్నాడు. బ్రాటిస్లావాలో జరిగిన స్టార్మస్ ఫెస్టివల్ సందర్భంగా అతను తన కొత్త ప్రయోగం గురించిన సమాచారాన్ని ప్రపంచం ముందు వెల్లడించినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. సంవత్సరాలుగా ఈ రోజు ప్రపంచం ఉపయోగిస్తున్న బిలియన్ల మరియు ట్రిలియన్ల ఉత్పత్తులను తయారు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నా ఈ ఉత్పత్తి భూమిని రక్షించడం కోసమని స్పష్టం చేశాడు.
ఏ విధంగా వజ్రాలను సిద్ధం చేస్తుందంటే
టోనీ ఫాడెల్ ఓ ప్రకటనలో ఇప్పుడు తాను భూమికి సహాయపడే ఉత్పత్తులను తయారు చేయడంలో ఎక్కువ సమయం గడుపుతున్నానని వెల్లడించాడు. ఇప్పుడు మీథేన్ వాతావరణంలో కలిసిపోవడం గుర్తించిన తన బృందం ఈ ఏడాది ప్రారంభంలో మీథేన్ శాట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీని సహాయంతో తాము మీథేన్ మూలాన్ని తెలుసుకుంటామని చెప్పారు. ఎందుకంటే వజ్రాలను తయారు చేయడానికి మాకు పెద్ద మొత్తంలో మీథేన్ అవసరం. ఈ ప్రాజెక్ట్ కోసం.. తాను డైమండ్ ఫౌండ్రీ అనే కంపెనీని ప్రారంభించానని చెప్పారు. ఈ కంపెనీలో భూమి నుండి లేదా ఆవుల వంటి జంతువుల నుండి బయోమీథేన్‌ను తీసుకొని కృత్రిమ వజ్రాలను తయారు చేస్తామని స్పష్టం చేశారు.
తన ఈ ఆవిష్కరణ యొక్క ఏకైక ఉద్దేశ్యం ఏమిటంటే, భూమిపై ఉన్న మీథేన్‌ను ఏదో ఒకవిధంగా ఆపడానికి ప్రయత్నిస్తామని.. తద్వారా అది వాతావరణంలో వ్యాపించదు. ఎందుకంటే మీథేన్ గాలిలో కలిసి భూమి ఉష్ణోగ్రతను పెంచుతోంది. మన ఉనికి ప్రమాదంలో ఉంది. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకుని తాను CH4 గ్లోబల్ అనే మరో కంపెనీని ఏర్పాటు చేసానని.. కనుక తాము ఎర్ర సముద్రపు నాచుని తయారు చేస్తాము. దీనిని మేతతో కలిపి ఆవులకు తినిపిస్తే వాటి త్రేన్పులు 80 నుంచి 90 శాతం తగ్గుతాయని వెల్లడించారు. మీథేన్ విడుదలైన తర్వాత.. అది మానవులకు 80 శాతం హానికరం కాబట్టి టోనీ ఖచ్చితంగా సరైనదని పర్యావరణ వేత్తలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..