భారీ ఉల్కాపాతం.. అర్ధరాత్రి ని పట్టపగలు లా మార్చిన కాంతి..

భారీ ఉల్కాపాతం.. అర్ధరాత్రి ని పట్టపగలు లా మార్చిన కాంతి..

Phani CH

|

Updated on: May 21, 2024 | 8:39 PM

ఆకాశం నుంచి భారీ ఉల్కలు నేల రాలుతాయని మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ నిజ జీవితంలో అలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతంఉటాయి. వందలు, వేల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ ఉల్కాపాతం సంభవిస్తుంటుంది. అయితే తాజాగా స్పెయిన్, పోర్చుగల్‌లో దేశాల్లో శనివారం రాత్రి భారీ ఉల్కాపాతం సంభవించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఆకాశం నుంచి భారీ ఉల్కలు నేల రాలుతాయని మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ నిజ జీవితంలో అలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతంఉటాయి. వందలు, వేల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ ఉల్కాపాతం సంభవిస్తుంటుంది. అయితే తాజాగా స్పెయిన్, పోర్చుగల్‌లో దేశాల్లో శనివారం రాత్రి భారీ ఉల్కాపాతం సంభవించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వీడియోలో రాత్రి సమయంలో భారీ ఉల్క ఒకటి ఆకాశం నుంచి అత్యంత వేగంగా భూమి మీదకు దూసుకొచ్చింది. అలాగే కళ్లు మిరు మిట్లు కొలిపే వెలుగులు విరజిమ్ముతూ వచ్చిన ఈ ఉల్కాపాతం వల్ల అర్ధరాత్రి సమయం కూడా ఒక్కసారిగా పట్టపగలులా మారిపోయింది. అది చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఒక్కక్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే ఆ వెలుగు రేఖ ఉల్కాపాతమా కాదా? అది ఎక్కడ నుంచి వచ్చింది, ఎక్కడ పడింది అనే విషయాలపై అంతరిక్ష సంస్థలు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అది భారీ ఉల్కేనని.. క్యాస్ట్రో డైరో అనే ప్రాంతంలో పడిందనే ప్రచారం మాత్రం జరుగుతోంది. NASA ప్రకారం, ఉల్కలు భూమి యొక్క వాతావరణంలోకి అధిక వేగంతో ప్రవేశించి కాలిపోయినప్పుడు, ఫైర్‌బాల్స్, షూటింగ్ స్టార్‌లను ఉల్కలు అంటారు. ఉల్కలు, అంతరిక్షంలోని రాళ్లు, దుమ్ము రేణువుల నుంచి పరిమాణంలో ఉంటాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొంపముంచిన రీల్స్‌ పిచ్చి.. ముగ్గురు మృతి..

టేకాఫ్‌ అయిన విమానంలో మంటలు.. దానిలో ఉన్న 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ??

కరోనా ఉపద్రవం మళ్లీ స్టార్ట్ !! వారంలో రోజుల్లో గణనీయంగాపెరిగిన కేసుల సంఖ్య

Spicy Chip Challenge: బాలుడి ప్రాణం తీసిన ఘాటైన చిప్‌ ఛాలెంజ్‌..

అదృశ్యమైన నటుడు.. 24 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు

అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??