కొంపముంచిన రీల్స్ పిచ్చి.. ముగ్గురు మృతి..
ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాల్లో రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో పాపులర్ అవడంకోసం ఎన్నెన్నో విన్యాసాలు చేస్తున్నారు. రీల్స్, వీడియోలు చేసి నెట్టింట పంచుకుంటున్నారు. లైక్స్ కోసం ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా బీహార్‌లో అలాంటి ఘటనే జరిగింది. రీల్స్ సరదా ఏకంగా నలుగురు యువకులు ప్రాణాలను బలిగింది. ఖగారియా జిల్లాలో గంగానదిలో రీల్స్ చిత్రీకరించే క్రమంలో ప్రమాదవశాత్తూ ఆరుగురు యువకులు నీటిలో మునిగారు.
ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాల్లో రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో పాపులర్ అవడంకోసం ఎన్నెన్నో విన్యాసాలు చేస్తున్నారు. రీల్స్, వీడియోలు చేసి నెట్టింట పంచుకుంటున్నారు. లైక్స్ కోసం ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా బీహార్‌లో అలాంటి ఘటనే జరిగింది. రీల్స్ సరదా ఏకంగా నలుగురు యువకులు ప్రాణాలను బలిగింది. ఖగారియా జిల్లాలో గంగానదిలో రీల్స్ చిత్రీకరించే క్రమంలో ప్రమాదవశాత్తూ ఆరుగురు యువకులు నీటిలో మునిగారు. ఇందులో నలుగురు యువకులు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. జిల్లాలోని పర్బట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అగువాని ఘాట్ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. మైనర్ యువతితో సహా ఆరుగురు రీల్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరిని స్థానికులు రక్షించగలిగారని చెప్పారు. నీటిలో మునిగిన నలుగురి కోసం ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు అన్వేషించినా ఆచూకీ దొరకలేదని వివరించారు. నీటి ప్రవాహ ఉధృతిని పసిగట్టలేకపోయారని, ప్రమాదాన్ని గుర్తించక రీల్స్ షూట్ చేసేందుకు నీటిలోకి దిగారని పర్బట్టా పోలీసులు వివరించారు. మునిగిపోయినవారి ఆచూకీ కోసం స్థానిక ఈతగాళ్లతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు పోలీసు అధికారులు వివరించారు. చనిపోయినవారి పేర్లు నిఖిల్ కుమార్ , ఆదిత్య కుమార్, రాజన్ కుమార్, శుభం కుమార్‌గా వెల్లడించారు. శ్యామ్ కుమార్ అనే యువకుడితో పాటు అతడి సోదరి ప్రాణాలతో బయటపడ్డారని వివరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టేకాఫ్ అయిన విమానంలో మంటలు.. దానిలో ఉన్న 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ??
కరోనా ఉపద్రవం మళ్లీ స్టార్ట్ !! వారంలో రోజుల్లో గణనీయంగాపెరిగిన కేసుల సంఖ్య
Spicy Chip Challenge: బాలుడి ప్రాణం తీసిన ఘాటైన చిప్ ఛాలెంజ్..
అదృశ్యమైన నటుడు.. 24 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు
అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??