టేకాఫ్‌ అయిన విమానంలో మంటలు.. దానిలో ఉన్న 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ??

టేకాఫ్‌ అయిన విమానంలో మంటలు.. దానిలో ఉన్న 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ??

Phani CH

|

Updated on: May 21, 2024 | 8:36 PM

టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే విమానలంలో మంటలు చెలరేగాయి. పెను ప్రమాదాన్ని గుర్తించిన పైలట్‌ వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయడంతో 179 మంది ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటన ఎయిర్‌ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటల చెలరేగడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి బెంగళూరులో ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే విమానలంలో మంటలు చెలరేగాయి. పెను ప్రమాదాన్ని గుర్తించిన పైలట్‌ వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయడంతో 179 మంది ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటన ఎయిర్‌ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటల చెలరేగడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి బెంగళూరులో ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను అత్యవసరంగా ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజిన్‌లో మంటల గుర్తించిన సిబ్బంది వెంటనే ఆ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ (ATC)కు చేరవేశారు. మరుక్షణం పూర్తిస్థాయి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి వచ్చింది. విమానం ల్యాండ్ కావడానికి ముందే అగ్నిమాపక సిబ్బందిని రన్‌వేపై మోహరించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపినట్టు బెంగళూరు విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కరోనా ఉపద్రవం మళ్లీ స్టార్ట్ !! వారంలో రోజుల్లో గణనీయంగాపెరిగిన కేసుల సంఖ్య

Spicy Chip Challenge: బాలుడి ప్రాణం తీసిన ఘాటైన చిప్‌ ఛాలెంజ్‌..

అదృశ్యమైన నటుడు.. 24 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు

అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??