రూ.32లక్షల ఖరీదైన వాచ్ చోరీ.. బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని.. చివరకు ఏమైందంటే..
బైక్‌పై వచ్చిన ఒక దొంగ తుపాకీ గురిపెట్టి లాంబోర్గినీలో ఉన్న వ్యాపారి వద్ద నుంచి 32 లక్షల రూపాయల విలువైన వాచ్‌ను తీసుకున్నాడు. బైక్‌పై వచ్చిన ఆ దొంగ చిన్నపాటి గ్యాప్‌తో అక్కడి నుంచి పరారయ్యాడు. సిగ్నల్ పడటంతో, వ్యాపారవేత్త తన సూపర్ కార్ లాంబోర్గినిలో దొంగను అతి వేగంతో వెంబడించాడు. లంబోర్గినీ వేగం దొంగను పట్టుకుంది. అయితే
ఓ ధనిక వ్యాపారి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉండగా తుపాకీ గురిపెట్టి 32 లక్షల రూపాయల విలువైన రోలెక్స్ వాచ్‌ని దొంగిలించాడు ఓ దుండగుడు. అనంతరం బైక్‌పై వేగంగా పారిపోయే ప్రయత్నం చేశాడు.. వాచ్ దొంగను పట్టుకునేందుకు యజమాని తన 4 కోట్ల రూపాయల విలువైన లంబోర్గిని కారుతో వెంబడించాడు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకుంటూ, దొంగోడి బైక్‌ను ఢీకొట్టాడు. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దాంతో ఆ స్తంభం అమాంతంగా కారుపై కూలింది. దీంతో యజమాని లాంబోర్గినీ కారు నుజ్జునుజ్జయింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు, బైకుపై నుంచి కిందపడిన దొంగ.. తన బైకును, మొబైల్ ఫోన్‌ను ఘటనా స్థలంలోనే వదిలేసి.. దొంగిలించిన వాచ్‌ను తీసుకుని పారిపోయాడు. పోలీసులు మొబైల్ ఫోన్ ఆధారంగా దొంగను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన బ్రెజిల్ రాజధాని సావోపాలోలో చోటుచేసుకుంది. వ్యాపారవేత్త తన ఆకుపచ్చ లంబోర్గిని కారులో ప్రయాణిస్తున్నాడు. సిగ్నల్ వద్ద వాహనాలన్నీ ఆగిపోయాయి. ల్యాంబోర్గినీ కారుకు వెనుక, ముందు వాహనాలు నిలిచి ఉన్నాయి. అదే సమయంలో రోడ్డు పక్కన బైక్‌పై వచ్చిన ఒక దొంగ తుపాకీ గురిపెట్టి లాంబోర్గినీలో ఉన్న వ్యాపారి వద్ద నుంచి 32 లక్షల రూపాయల విలువైన వాచ్‌ను తీసుకున్నాడు. బైక్‌పై వచ్చిన ఆ దొంగ చిన్నపాటి గ్యాప్‌తో అక్కడి నుంచి పరారయ్యాడు. సిగ్నల్ పడటంతో, వ్యాపారవేత్త తన సూపర్ కార్ లాంబోర్గినిలో దొంగను అతి వేగంతో వెంబడించాడు. లంబోర్గినీ వేగం దొంగను పట్టుకుంది. అయితే లంబోర్గినీ తనని వెంబడించడం గమనించిన దొంగ అకస్మాత్తుగా ఎడమవైపు మళ్లాడు.
Motorista de Lamborghini persegue ladrão de Rolex e acaba batendo em poste na Faria Lima em São Paulo pic.twitter.com/AANSrcd6Ov
— BHAZ (@portal_bhaz) May 19, 2024
సదరు వ్యాపారి దొంగ బైక్‌ను వెనుక నుంచి లాంబోర్గినీతో ఢీకొట్టాడు. బైక్ నేల కరిచింది. అయితే స్వల్పంగా గాయపడిన దొంగ బైక్ వదిలేసి పారిపోయాడు. అయితే వ్యాపారి కారు బైక్‌ను ఢీకొని రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. డైవర్ దగ్గర ఉన్న లైట్ పోస్ట్ కూడా కారుపై పడింది. 4 కోట్ల రూపాయల లాంబోర్గినీ కారు నుజ్జునుజ్జయింది. అయితే ఆ దొంగ మాత్రమే ఆచూకీ లభించలేదు. కానీ, పాపం బాధితుడికి మాత్రం రూ.32 లక్షల విలువైన వాచ్ చోరీకి గురికాగా, రూ.4 కోట్ల విలువైన లాంబోర్గినీ కారు పోయింది. సరికొత్త కారు పూర్తిగా పాడైపోయి, ఇష్టమైన వాచ్ కూడా పోయిందంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..