Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గోవులపై పాకుతున్న ప్రమాదకర పాము.. కానీ అతను మాత్రం బుద్ధి లేకుండా

సొసైటీలో తిక్కలోళ్లు ఎక్కువైపోయారు. మరి ఈ వీడియో తీసిన వ్యక్తిని ఏమంటారో మీ ఇష్టం. ఆవుల పైన ప్రమాదకర పాము పాకుతుందో ఎంచక్కా వీడియో తీశాడు. ఇప్పుడు నెటిజన్లతో తిట్లు తింటున్నాడు. వివరాలు తెలుసుకుందాం పదండి.....

Viral Video: గోవులపై పాకుతున్న ప్రమాదకర పాము.. కానీ అతను మాత్రం బుద్ధి లేకుండా
Snake slithers around on two cows
Follow us
Ram Naramaneni

|

Updated on: May 22, 2024 | 1:20 PM

ఇంటర్నెట్‌లో వ్యూస్, లైక్స్ కోసం.. ఇప్పటి యువత ఎలాంటి పిచ్చి పనులు, పాడు పనులు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. కొందరు నలుగురిలో నవ్వుల పాలు అవుతుంటే.. ఇంకొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా.. అందులో గాయాలు అయినవారిని రక్షిద్దాం.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్దాం అని ఆలోచించకుండా.. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో సినిమా మాదిరి చిత్రీకరిస్తున్నారు కొందరు. మనుషుల్నే పట్టించుకోవడం లేదు ఇక జంతువులు, మూగ జీవుల గురించి ఆలోచిస్తారు అనుకుంటే మన పిచ్చితనం అవుతుంది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. పాము ఆవుల మీద పాకుతూ కనిపించింది. ఆ దృశ్యాలను ఓ వ్యక్తి అందంగా చిత్రీకరించాడు. దీంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. పామును వాటిపై నుంచి తొలగించే ప్రయత్నం చేయకుండా వీడియో తీయడం సిగ్గుచేటు అని దుయ్యబడుతున్నారు. ఇంటర్నెట్ కంటెంట్‌ను తయారు చేయడం కోసం ఆ వ్యక్తే..  ఆవులను ప్రమాదంలో పడేస్తున్నాడని చాలా మంది వ్యక్తులు ఫైరవుతున్నారు. ఈ వీడియో తీసిన వ్యక్తిని ‘జంతు హింస’ నేరం కింద జైల్లో వేయాలని సూచిస్తున్నారు.

వీడియో దిగువన చూడండి…. 

View this post on Instagram

A post shared by India YaTra (@india.yatra)

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఇండియా యాత్ర’ హ్యాండిల్ షేర్ చేసింది. కొద్దిసేపట్లోనే వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో లొకేషన్ ఎక్కడ.. వీడియో తీసింది ఎవరు అనే వివరాలు తెలియరాలేదు. పాము కాటుకు గేదెలు, ఆవులు కూడా బలైయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఏదైయినా మూగజీవాలు ఈ రకమైన ప్రమాదంలో ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి ప్రవర్తనను అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..