Viral Video: వామ్మో.. రక్తపింజరను నూడిల్స్ తిన్నట్లు తినేసిన గుడ్లగూబ..

గుడ్లగూబ రాత్రి సమయాల్లో మస్త్ యాక్టివ్ ఉంటుంది. రాత్రి వేళల్లో దాని చూపు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. పురుగులు, కీటకాలు, చిన్న పిట్టల్ని గుడ్లగూబ వేటాడి తినడం మీరు ఇప్పటివరకు చూసి ఉంటారు. అయితే ఓ పామును నూడిల్స్ తిన్నట్లు కరకరా నమిలి తినేసింది ఈ గుడ్లగూబ.. వీడియో....

Viral Video: వామ్మో.. రక్తపింజరను నూడిల్స్ తిన్నట్లు తినేసిన గుడ్లగూబ..
Owl Eats Snake
Follow us
Ram Naramaneni

|

Updated on: May 22, 2024 | 12:43 PM

అడవిలో ఒక జీవికి ఆకలి వేస్తే.. ఇంకో జీవికి ఆయువు మూడినట్లే. అయితే ఆహారం కోసం వేటాడుతూ కొన్నిసార్లు జీవులు.. రిస్క్ చేస్తూ ఉంటాయి. తమకంటే బలియమైన జీవులతో పోరాడుతూ ఉంటాయి. ఇంకొన్ని సార్లు విషపూరితమైన వాటి జోలికి కూడా వెళ్తాయి. సాధారణంగా మాములు పక్షుల్ని, ఎలుకల్ని, కప్పల్ని లేదా ఏదైనా గుడ్లను మింగడం మీరు చూసే ఉంటారు. పెద్ద జీవులను అమాంతం మింగేందుకు..  పాము దవడలు సౌకర్యవంతంగా ఉంటాయి. పాము గుడ్లగూబను కూడా మింగడం మీరు చూసి ఉంటారు. అయితే గుడ్లగూబ పామును మింగడం మీరెప్పుడైనా చూశారా..? చాలా అరుదైన ఘటన కెమెరాకు చిక్కింది. మీడియం సైజు పామును గుడ్లగూబ కరకరా నమిలి తినేసింది. ఆ పాము కూడా ప్రమాదకర రక్త పింజరలా కనిపిస్తుంది. అయినా కానీ తోక నుంచి మొదలెట్టి… తల వరకు స్లోగా టైం తీసుకుని మింగేసింది గుడ్లగూబ. అయితే తనను మింగేస్తున్నా ఆ పాము కాటు వేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.

వీడియో దిగువన చూడండి…. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు స్టన్ అవుతున్నారు. గుడ్లగూబలు ఇలా పాముల్ని మింగేస్తాయని నాకు తెలీదు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “వామ్మో.. ఈ దృశ్యం భయానకంగా ఉంది” అని ఒక వ్యక్తి పేర్కొన్నాడు. “ఆ పామును అరిగించుకోడానికి ఆ గుడ్లగూబకు ఎంత సమయం పడుతుందో” అని మరొకరు వ్యాఖ్యానించారు. గుడ్లగూబలు రాత్రి పూట చాలా యాక్టివ్‌గా ఉండి ఆహారం కోసం వేటాడుతాయి. గుడ్లగూబ ఒక మాంసాహార పక్షి. పురుగులు, చిన్న క్షీరదాలు, చిన్న పక్షులు… కొన్ని జాతుల చేపలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి…