వార్నీ.. ఈ అక్క గ్యాస్ ఖర్చు బాగానే మిగిలిస్తుంది..! నడిరోడ్డుపై ఏం చేస్తుందో చూడండి

దంచికొడుతున్న ఎండలను కూడా తమ పాకశాస్త్ర ప్రావీణ్యానికి వాడేసుకుంటున్నారు చాలా మంది. ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి కనిపించింది. ఒక మహిళ నడిరోడ్డుపై ఆమ్లేట్‌ వేస్తానంటూ హల్‌చల్‌ చేసింది. తన చేస్తున్నదంతా రికార్డ్‌ చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ వీడియో చూసిన జనాలు పెద్ద సంఖ్యలో స్పందించటం మొదలుపెట్టారు.

వార్నీ..  ఈ అక్క గ్యాస్ ఖర్చు బాగానే మిగిలిస్తుంది..! నడిరోడ్డుపై ఏం చేస్తుందో చూడండి
Cook Eggs On Road
Follow us

|

Updated on: May 22, 2024 | 5:16 PM

కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ప్రజలు అనేక రకాల కొత్త కొత్త వంటకాలు ట్రై చేశారు. అవన్నీ వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు. దాంతో ఇంటర్నెట్ నిండా చిత్ర విచిత్ర వంటకాలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడూ పరిస్థితి మరోలా మారింది. దంచికొడుతున్న ఎండలను కూడా తమ పాకశాస్త్ర ప్రావీణ్యానికి వాడేసుకుంటున్నారు చాలా మంది. ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి కనిపించింది. ఒక మహిళ నడిరోడ్డుపై ఆమ్లేట్‌ వేస్తానంటూ హల్‌చల్‌ చేసింది. తన చేస్తున్నదంతా రికార్డ్‌ చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ వీడియో చూసిన జనాలు పెద్ద సంఖ్యలో స్పందించటం మొదలుపెట్టారు.

వైరల్‌ వీడియోలో ఒక యువతి రెండు కోడి గుడ్లు తీసుకుని ఓ డాంబర్‌ రోడ్డుమీద కూర్చుంది. వాటితో ఆమె ఆ రోడ్డుపైనే ఆమ్లెట్‌ వేసేందుకు సిద్ధపడింది. ముందుగా ఆ రోడ్డుపై నీళ్లు పోసి క్లీన్‌ చేసింది. ఆ తరువాత తన దుప్పటతోనే ఆ రోడ్డును గట్టిగా తుడిచేసింది. ఆ తర్వాత ఆయిల్‌ వేసింది. దానిపై రెండు గుడ్లు కొట్టి ఒక గరిటెతో ఆమ్లెట్‌లా తిప్పుతోంది. చివరకు ఆ ఆమ్లెట్‌ ఏమైందో మాత్రం వీడియోలో చూపించలేదు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని చెప్పేందుకు ఈ మహిళ చేసిన ప్రయత్నం నెటిజన్ల విమర్శలకు దారితీసింది. వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by modi tejal (@tejalmodi454)

ఇప్పటివరకు ఈ వీడియోకి 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఈ మహిళ చేసిన ప్రయత్నం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ మహిళ గ్యాస్‌ ఆదాచేసేందుకు ఆహారాన్ని వృధా చేసిందని పలువురు విమర్శించారు. మరికొందరు అటువంటి కంటెంట్ సృష్టికి రహదారిని వేదికగా ఉపయోగించడం గురించి ఆందోళన చెందారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో ఎండ తీవ్రత ఎలా ఉందో చూపించే వీడియో ఒకటి ఇప్పటికే మనందరం చూశాం. ఆ వీడియో ఒక జవాన్‌కు సంబంధించింది. అతను ఉన్న ప్రాంతంలోని ఎడారి ఇసుకలో పాపడ్‌ ఉంచిన 30 సెకన్లలో అది బాగా ఉడికిపోయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే షాకే
అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే షాకే
విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి
విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి
కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది
కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది
గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!
గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!
‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి
‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి
పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు
పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు
త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా మార్పులు
త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా మార్పులు
రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా
రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా