Driving Licence: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తున్నారా..? ఆర్టీవో కొత్త రూల్స్.. జూన్ 1 నుంచి అమల్లోకి.. బీ అలర్ట్
డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్ సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1 నుంచే అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనల మార్పు అంశంపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది దేశవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్‌లను పొందాలనుకునే వారికి చాలా ఉపశమనం కలిగిస్తుంది.
జూన్ 1, 2024 నుండి దేశవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్‌ల తయారీకి సంబంధించిన నిబంధనలను మార్చనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న నింధనలలో కొన్నింటిని సవరించింది. డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్ సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1 నుంచే అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనల మార్పు అంశంపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది దేశవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్‌లను పొందాలనుకునే వారికి చాలా ఉపశమనం కలిగిస్తుంది.
కొత్త నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఏ వ్యక్తి ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. బదులుగా, డ్రైవింగ్ నేర్పించే సంస్థలకు ప్రభుత్వం సర్టిఫికేట్లను కూడా జారీ చేస్తుంది. దీంతో ఆర్టీఓ వద్దకు వెళ్లి పరీక్ష పెట్టే బదులు డ్రైవింగ్ స్కూల్ నుండే డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉంటుంది. లైసెన్స్ కోసం అభ్యర్థులు ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లడానికి బదులుగా మీరు ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ల వద్ద డ్రైవింగ్ టెస్టుకు హాజరుకావచ్చు. వారు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి వాహనదారుడికి ఓ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని ఆర్‌టీఓ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది. దానితో పాటు పలు పత్రాలు సమర్పించాలి. ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం నేరుగా ఆర్‌టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా లైసెన్స్ జారీ చేయడం ద్వారా సమయం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సైతం కేంద్రం పలు నిబంధనలు పెట్టింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసం అయితే ఒక ఎకరం భూమి కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే ఫోర్ వీలర్ శిక్షణ కోసం అయితే మరో 2 ఎకరాల భూమి అదనంగా ఉండాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటేనే వారికి ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుంది.
మరోవైపు ఇక్కడ ఉండే ట్రైనర్లకు కూడా కొన్ని నిబంధనలు విధించింది. ట్రైనర్లకు కనీసం హైస్కూల్ డిప్లామా అర్హత తప్పనిసరి చేసింది కేంద్రం. కనీసం 5 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఖచ్చితంగా ఉండాలని చెప్పింది. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలని సూచించింది. లైట్ మోటార్ వెహీకల్ శిక్షణ 4 వారాల్లో లేదా కనీసం 29 గంటల్లో పూర్తి చేయాలని వివరించింది.
అలాగే ఈ శిక్షణ రెండు విభాగాలుగా ఉండాలని కేంద్రం సూచించింది. థియరీ కోసం 8 గంటలు, ప్రాక్టికల్ కోసం 21 గంటలు కనీసం కేటాయించాలని పేర్కొంది.. హెవీ మోటార్ వెహీకల్స్ అయితే 38 గంటల కనీస శిక్షణ.. 8 గంటలు థియరీ ఎడ్యుకేషన్, 31 గంటలు ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి చేసింది.. కొత్తగా లైసెన్స్ తీసుకునేందుకు ప్రయత్నించేవాళ్లు ఈ నిబంధనలు దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..