IPL 2024: ఐపీఎల్ టిక్కెట్ బుకింగ్ విషయంలో వెలుగులోకి కీలక మోసం.. టిక్కెట్ బుక్ చేసుకుంటే రూ.3 లక్షల స్వాహా..!

బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి మ్యాచ్ కోసం టిక్కెట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు రూ. 3 లక్షలు కోల్పోయాడు. బాధితుడు మే 10-11వ తేదీల  మధ్య హై-ప్రొఫైల్ ఆర్‌సీబీ-సీఎస్‌కే మ్యాచ్ కోసం టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు. అధిక డిమాండ్ కారణంగా అతను అధికారిక ఛానెల్‌ల నుండి టిక్కెట్‌లను పొందలేకపోయాడు. అతడు అనధికార ఛానెల్‌లను ఆశ్రయించి తన సొమ్ము పొగొట్టుకున్నాడు. బాధితుడు టిక్కెట్ బుకింగ్ ఎలాంటి మోసానికి గురయ్యాడో? ఓ సారి తెలుసుకుందాం. 

IPL 2024: ఐపీఎల్ టిక్కెట్ బుకింగ్ విషయంలో వెలుగులోకి కీలక మోసం.. టిక్కెట్ బుక్ చేసుకుంటే రూ.3 లక్షల స్వాహా..!
Cricket
Follow us
Srinu

|

Updated on: May 22, 2024 | 4:00 PM

ప్రస్తుతం భారతదేశంలో ఐపీఎల్ 2024 పూర్తి స్వింగ్‌లో ఉంది. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. ఈ మ్యాచ్ విజయవంతమైంది. ముఖ్యంగా ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ జట్ల మధ్య పోటీను చూసేందుకు స్టేడియం పూర్తిగా నిండిపోయింది. అయితే బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి మ్యాచ్ కోసం టిక్కెట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు రూ. 3 లక్షలు కోల్పోయాడు. బాధితుడు మే 10-11వ తేదీల  మధ్య హై-ప్రొఫైల్ ఆర్‌సీబీ-సీఎస్‌కే మ్యాచ్ కోసం టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు. అధిక డిమాండ్ కారణంగా అతను అధికారిక ఛానెల్‌ల నుండి టిక్కెట్‌లను పొందలేకపోయాడు. అతడు అనధికార ఛానెల్‌లను ఆశ్రయించి తన సొమ్ము పొగొట్టుకున్నాడు. బాధితుడు టిక్కెట్ బుకింగ్ ఎలాంటి మోసానికి గురయ్యాడో? ఓ సారి తెలుసుకుందాం. 

బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఐపీఎల్_2024_టిక్కెట్స్__24’ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఒక ప్రకటనను చూశాడు. ప్రకటనదారుడు తనను తాను పద్మ సింహ విజయ్ కుమార్‌గా పేర్కొంటూ తన వద్ద ఆర్‌సీబీ-సీఎస్‌కే మ్యాచ్‌కి టిక్కెట్లు కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. ఐపీఎల్ టిక్కెట్లను విక్రయించడానికి అధికారిక ఫ్రాంచైజీని తానేనని బాధితుడికి ఆధార్ కార్డ్ ఫోటో, అతని మొబైల్ నంబర్‌ను అందించాలని కోరాడు. చెల్లింపుపై బాధితుడికి ఈ-టికెట్‌ల హామీ ఇస్తూ లావాదేవీ ప్రక్రియను ప్రారంభించాడు. బాధితుడు మూడు టిక్కెట్లకు రూ. 7,900 బదిలీ చేశాడు కానీ ప్రతిఫలంగా ఈ-టికెట్లు రాలేదు. అతను కుమార్‌ను ప్రశ్నించగా మోసగాడు సాంకేతిక సమస్యలను ఉటంకిస్తూ అదనంగా రూ.67,000 కోరాడు. టిక్కెట్లతో పాటు వాపసు ఇస్తామని పేర్కొన్నాడు. 

అనంతరం బాధితుడి మోసాగాడు కోరిన సొమ్మును దఫదఫాలుగా పంపించాడు. చివరికి మొత్తం రూ. 3 లక్షలు బదిలీ చేసినా టిక్కెట్లు రాకపోవడంతో, బాధితుడు తాను మోసపోయానని గ్రహించి పోలీసుల సహాయాన్ని కోరాడు. ముఖ్యంగా, అధిక డిమాండ్ మధ్య అనేక బ్లాక్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్‌లు అధిక ధరలకు టిక్కెట్‌లను విక్రయించడానికి ప్రయత్నిస్తాయి. అయితే వారి మాయలో పడవద్దని, అధికారిక వనరుల నుండి మాత్రమే టిక్కెట్లను కొనుగోలు చేయాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..