AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Insurance: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్

మే 19న జరిగిన దురదృష్టకర సంఘటనలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ సమీపంలోని ఉర్కురా రైల్వే స్టేషన్ గుండా వెళుతుండగా షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌పై ఇనుప స్తంభం పడిపోవడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. షాలిమార్ ఎక్స్‌ప్రెస్ లోకమాన్య తిలక్ టెర్మినస్ (ముంబై)కి వెళ్తుండగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. ఇటువంటి సంఘటనలు రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.

Railway Insurance: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్
Train5
Nikhil
|

Updated on: May 22, 2024 | 4:30 PM

Share

భారతదేశంలో రైలు ప్రయాణం అనేది అతి చౌకైన ప్రయాణ సాధనంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు సంభవించడం అనేది పరిపాటి మారింది. మే 19న జరిగిన దురదృష్టకర సంఘటనలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ సమీపంలోని ఉర్కురా రైల్వే స్టేషన్ గుండా వెళుతుండగా షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌పై ఇనుప స్తంభం పడిపోవడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. షాలిమార్ ఎక్స్‌ప్రెస్ లోకమాన్య తిలక్ టెర్మినస్ (ముంబై)కి వెళ్తుండగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. ఇటువంటి సంఘటనలు రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ఇది ప్రయాణీకులకు మరణం లేదా గాయం అయినప్పుడు పరిహారం అందించేందుకు భారతీయ రైల్వేలు అందించిన సదుపాయం. కాబట్టి రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి కీలక విషయాలను తెలుసుకుందాం. 

రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయోజనం టిక్కెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు బీమా తీసుకున్న ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బీమా ప్రీమియం కేవలం 45 పైసలు, అలాగే రూ. 10 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది. అయితే చాలా మంది ప్రయాణికులకు ఈ పథకంపై అవగాహన ఉండడం లేదు. రైల్వే టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ప్రయాణికులకు ప్రత్యేకంగా రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది. కౌంటర్ నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసే వారికి లేదా సాధారణ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే వారికి ఈ బీమా యాక్సెస్ ఉండదు. ఈ బీమా ఐచ్ఛికం అంటే తీసుకోవాలా వద్దా అనేది ప్రయాణీకులపై ఆధారపడి ఉంటుంది. మీకు రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే రైలు ప్రమాదంలో ప్రయాణికుడికి కలిగే నష్టాన్ని బీమా కంపెనీ భర్తీ చేస్తుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణించినా లేదా పూర్తిగా అంగవైకల్యం చెందితే రూ. 10 లక్షల బీమా మొత్తం అందిస్తారు. శాశ్వత పాక్షిక వైకల్యం ఉన్న సందర్భాల్లో ప్రయాణికుడికి రూ.7.5 లక్షల బీమా మొత్తం ఇస్తారు. అదే సమయంలో గాయం అయితే, చికిత్స ఖర్చుల కోసం రూ. 2 లక్షలు అందిస్తారు. 

రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ని పొందడం ఇలా

రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందేందుకు ప్రయాణీకులు తమ ప్రయాణ తరగతితో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకునేటప్పుడు ఐచ్ఛిక బీమాను ఎంచుకోవాలి. బీమా కోసం మీకు కేవలం 45 పైసలు మాత్రమే వసూలు చేస్తారు. బీమాను ఎంచుకున్న తర్వాత, నామినీ వివరాలను పూరించడానికి ప్రయాణీకుల ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌కు లింక్ పంపుతారు. బీమా పాలసీలో నామినీని కలిగి ఉండటం వల్ల బీమా క్లెయిమ్ పొందడం సులభం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..