Ladakh Army Bus Accident: ఎంతో బాధపడ్డాను.. లఢఖ్‌ ప్రమాదంపై ప్రధాని మోడీ ట్వీట్‌

Ladakh Army Bus Accident: లడఖ్‌లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు సైనికులు దుర్మరణం చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన సైనికులు..

Ladakh Army Bus Accident: ఎంతో బాధపడ్డాను.. లఢఖ్‌ ప్రమాదంపై ప్రధాని మోడీ ట్వీట్‌
Follow us

|

Updated on: May 27, 2022 | 9:44 PM

Ladakh Army Bus Accident: లడఖ్‌లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు సైనికులు దుర్మరణం చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో సైనికులతో వెళ్తున్న బస్సు రోడ్డుపై నుండి జారి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు దుర్మరణం చెందగా, పలువురు జవాన్లు గాయపడడ్డారు.

ఈ లడఖ్ ప్రమాదంపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, ‘లడఖ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మన వీర సైనికులను కోల్పోయినందుకు బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. దుర్మరణం చెందిన సైనిక కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం.. అని అన్నారు.

ఇవి కూడా చదవండి

సంతాపం వ్యక్తి చేసిన రాజ్‌నాథ్ సింగ్

అలాగే బస్సు ప్రమాదంలో సైనికుల మృతిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదం కారణంగా భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారు దేశానికి చేసిన సేవలను ఎప్పటికీ మరువలేం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదం జరిగిన తీరుపై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో మాట్లాడాను. అతను పరిస్థితిని నాకు వివరించాడు. గాయపడిన సైనికుల ప్రాణాలను రక్షించడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాము.

జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా సంతాపం

ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది.’లడఖ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మన వీర ఆర్మీ జవాన్ల వీరమరణం గురించి తెలిసి చాలా బాధపడ్డానని కశ్మీర్‌ ఎల్జీ మనోజ్‌ సిన్హా అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేశం కోసం సైనికులు చేసిన నిస్వార్థ సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని అన్నారు.

కాగా, జమ్మూకశ్మీర్ లోని లద్దాఖ్(Ladakh) లో 26 మంది జవాన్లతో వెళ్తున్న బస్సు.. అదుపుతప్పి నదిలో పడిపోయింది. తుర్తుక్ సెక్టార్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పాయారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని పార్తాపూర్‌లోని 403 ఫీల్డ్ హాస్పిటల్‌కు తరలించారు. వాహనం దాదాపు 50-60 అడుగుల లోతులో పడిపోయింది. 26 మంది సైనికులతో కూడిన బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి సబ్ సెక్టార్ హనీఫ్‌ కు వెళ్తోంది. బస్సు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డుపై నుండి జారి షియోక్ నదిలో పడిపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి