Wayanad Landslide: మాటల్లో చెప్పలేని విషాదం.. ఆదుకోండి మహాప్రభో.. కేంద్రానికి కేరళ విజ్ఞప్తి..!
ఈ గ్రామాలపై ప్రకృతి విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఎంతో మంది జీవితాలు చిధ్రమైపోయాయి. మరెందరో జీవనోపాధిని కోల్పోయారు. ఆస్తి నష్టం అంచనాలకు అందకుండా ఉందంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.
మెప్పాడి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలను విపత్తు ప్రభావిత గ్రామాలుగా ప్రకటిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం నుంచి మరిన్ని నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వాయనాడ్‌లోని వైతిరి తాలూకాలోని కొత్తపాడి గ్రామం, వెల్లర్మల గ్రామం, త్రికైపేట గ్రామాలు మెప్పాడి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామాలపై ప్రకృతి విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఎంతో మంది జీవితాలు చిధ్రమైపోయాయి. మరెందరో జీవనోపాధిని కోల్పోయారు. ఆస్తి నష్టం అంచనాలకు అందకుండా ఉందంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.
“పై పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వయనాడ్ జిల్లా వైత్తిరి తాలూకాలోని కొత్తపాడి గ్రామం, వెల్లర్మాల గ్రామం, త్రికైపేట గ్రామంతో సహా మెప్పాడి గ్రామ పంచాయతీని 30-7-2024 నుండి విపత్తు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. తదుపరి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది,” అని ఉత్తర్వులు జారీ చేసింది.
కొండచరియలు విరిగిపడిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయడానికి ఈ నోటిఫికేషన్ వేదికగా మారే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక సంఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించడం వలన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మద్దతు ఆటోమేటిక్‌గా పెరుగుతుందని నిర్ధారిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..