AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: 14 నెలలు గడిచినా ఇంకా గూటికి రాని రూ2000 నోట్లు.. మార్కెట్లో ఇంకా ఎన్ని ఉన్నాయో తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,000 నోట్లను రద్దు చేసి 14 నెలలు దాటింది. ఇప్పటికీ రూ.7409 కోట్ల విలువైన రెండు వేల నోట్లు బ్యాంకుకు చేరలేదు. 2000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు చేరలేదు. 2000 నోట్లను ఆర్బీఐ నిషేధించింది. ఆ తర్వాత ఈ 2000 రూపాయల నోట్లను బ్యాంకుకు తిరిగి ఇవ్వడానికి గడువు విధించారు...

RBI: 14 నెలలు గడిచినా ఇంకా గూటికి రాని రూ2000 నోట్లు.. మార్కెట్లో ఇంకా ఎన్ని ఉన్నాయో తెలుసా?
Rs 2000 Notes
Subhash Goud
|

Updated on: Aug 02, 2024 | 5:18 PM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,000 నోట్లను రద్దు చేసి 14 నెలలు దాటింది. ఇప్పటికీ రూ.7409 కోట్ల విలువైన రెండు వేల నోట్లు బ్యాంకుకు చేరలేదు. 2000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు చేరలేదు. 2000 నోట్లను ఆర్బీఐ నిషేధించింది. ఆ తర్వాత ఈ 2000 రూపాయల నోట్లను బ్యాంకుకు తిరిగి ఇవ్వడానికి గడువు విధించారు. కానీ 97.92 శాతం నోట్లు బ్యాంకుకు తిరిగి వచ్చాయి. అయితే 2.08 శాతం నోట్లు ఇంకా బ్యాంకుకు చేరలేదని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: Wet Clothes: వర్షంలో తడిసిన బట్టలను త్వరగా ఆరబెట్టడం ఎలా? ఈ చిట్కాలు పాటించండి

2023 మే 19న చలామణిలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆ రోజు రూ.3.56 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. జూలై 31, 2024 నాటికి చాలా మంది ఈ నోట్లను తమ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. దీని ద్వారా చలామణిలో ఉన్న రూ. 2000 నోట్లను రూ.7409 కోట్లకు తగ్గించారు. అంటే చెలామణిలో ఉన్న 97.92 శాతం నోట్లు ఆర్‌బీఐకి తిరిగి వచ్చాయి. మొత్తం రూ.3.48 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి. అయితే చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో 2.08 శాతం ఇప్పటికీ బ్యాంకుకు తిరిగి రాలేదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: LPG Cylinder Price: గ్యాస్‌ సిలిండర్‌ వాడేవారికి భారీ గుడ్‌న్యూస్‌.. రూ.300 సబ్సిడీ

మీరు ఇప్పటికీ రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు:

2000 రూపాయల నోట్లు ఇప్పటికీ వ్యక్తులు లేదా సంస్థల నుండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధీకృత కార్యాలయాలలో స్వీకరిస్తున్నారు. ఈ నోట్లను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ఆర్‌బీఐ ప్రకటించిన కార్యాలయాలకు చాలా మంది రూ.2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా తమ బ్యాంకు ఖాతాలకు పంపుతున్నారు. 2000 నోట్లను తిరిగి ఇవ్వడానికి ఆర్బీఐ జారీ చేసిన బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. 2000 రూపాయల నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా ఉన్నాయి. వాటిని మీ బ్యాంకు ఖాతాలో జమ చేయవచ్చు.

ఈ 19 కార్యాలయాల్లో నోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశాలు:

అక్టోబర్ 8, 2023 తర్వాత రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) దేశవ్యాప్తంగా హైదరాబాద్‌, అహ్మదాబాద్, బేలాపూర్, బెంగుళూరు, భువనేశ్వర్, భోపాల్, చెన్నై, చండీగఢ్, గౌహతి, జమ్మూ, జైపూర్, కోల్‌కతా, కాన్పూర్, ముంబై, లక్నో, పాట్నా, నాగ్‌పూర్‌, తిరువనంతపురం, న్యూఢిల్లీలోని కార్యాలయాల్లో డిపాజిట్లు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా? ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్‌!

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి