LPG Cylinder Price: గ్యాస్‌ సిలిండర్‌ వాడేవారికి భారీ గుడ్‌న్యూస్‌.. రూ.300 సబ్సిడీ.. మరో 8 నెలల పాటు..!

దేశంలోని మోడీ సర్కార్‌ ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తోంది. ముఖ్యంగా గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికలకు ముందు గ్యాస్‌ సిలిండర్ ధరలను భారీగానే తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల ప్రారంభమైంది. ఈ నెలలో మరోసారి కోట్లాది మందికి సాధారణ వినియోగదారుల కంటే తక్కువ ధరకే ఎల్‌పీజీ సిలిండర్లు అందనున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, కస్టమర్‌లు..

LPG Cylinder Price: గ్యాస్‌ సిలిండర్‌ వాడేవారికి భారీ గుడ్‌న్యూస్‌.. రూ.300 సబ్సిడీ.. మరో 8 నెలల పాటు..!
Lpg Gas Cylinder
Follow us

|

Updated on: Aug 01, 2024 | 1:04 PM

దేశంలోని మోడీ సర్కార్‌ ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తోంది. ముఖ్యంగా గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికలకు ముందు గ్యాస్‌ సిలిండర్ ధరలను భారీగానే తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల ప్రారంభమైంది. ఈ నెలలో మరోసారి కోట్లాది మందికి సాధారణ వినియోగదారుల కంటే తక్కువ ధరకే ఎల్‌పీజీ సిలిండర్లు అందనున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, కస్టమర్‌లు వచ్చే ఎనిమిది నెలల వరకు ఈ సదుపాయం పొందుతూనే ఉంటారని తెలుస్తోంది. ఏ కస్టమర్లు దీని ప్రయోజనాన్ని పొందగలరో తెలుసుకుందాం.

రూ. 300 ప్రయోజనం

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం 300 రూపాయల సబ్సిడీని ఇస్తుంది. దీని కింద సాధారణ వినియోగదారుల కంటే లబ్ధిదారులకు 300 రూపాయల తక్కువ సిలిండర్ లభిస్తుంది. ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీలో సాధారణ కస్టమర్లు రూ.803కే ఎల్‌పీజీ సిలిండర్‌ను పొందుతున్నారు. అదే సమయంలో ఉజ్వల లబ్ధిదారులు రూ.300 తగ్గింపుతో రూ.503కే సిలిండర్‌ను పొందుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు ప్రధాన్‌ మంత్రి ఉజ్వల యోజన కింద పొందిన సిలిండర్లపై రూ.300 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అయితే ఇప్పుడు మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు ప్రకటించిన సబ్సిడీ పథకం మరో ఎనిమిది నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర వర్గాల ద్వారా సమాచారం. కేంద్ర కేబినెట్‌లో కూడా ఈ పథకం కొనసాగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Bank Holidays: 13 రోజుల పాటు మూసి ఉండనున్న బ్యాంకులు.. ఏయే రోజుల్లో అంటే..

ఎనిమిది నెలల పాటు..

ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద కవర్ చేయబడిన లబ్ధిదారులు మార్చి 31, 2025 వరకు ఎల్‌పీజీపై రూ. 300 సబ్సిడీని పొందుతారు. దీని అర్థం వచ్చే 8 నెలల వరకు వినియోగదారులు రూ. 300 తగ్గింపును పొదుతారు. పథకం లబ్ధిదారులకు ఒక సంవత్సరంలో 12 రీఫిల్స్ అందుకుంటారు. ఈ పథకం కింద 14.2 కిలోల సిలిండర్‌పై మాత్రమే రూ.300 సబ్సిడీ లభిస్తుంది.

2016లో ప్రారంభమైంది

ఈ పథకం 2016 సంవత్సరంలో ప్రారంభించారు. పథకం లబ్ధిదారుల గురించి చెప్పాలంటే, 9 కోట్ల మందికి పైగా ఉన్నారు. అదే సమయంలో ఈ పథకం కింద 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ విధంగా 10 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఉంటారు.

ఇది కూడా చదవండి: LPG Gas Prices: గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన సిలిండర్‌ ధర.. ఎంతో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి