AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas Prices: గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన సిలిండర్‌ ధర.. ఎంతో తెలుసా?

బడ్జెట్ తర్వాత సామాన్య ప్రజలు షాక్‌ ఇచ్చాయి గ్యాస్‌ సిలిండర్‌ కంపెనీలు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.8.50 పెంచాయి. కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. కానీ 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను పెంచాయి. IOCL వెబ్‌సైట్ ప్రకారం.. ఈ మారిన రేట్లు ఈరోజు అంటే ఆగస్టు 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి...

LPG Gas Prices: గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన సిలిండర్‌ ధర.. ఎంతో తెలుసా?
మనం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ నిండుది వాడుతున్నప్పుడు మంట రంగు నీలం రంగులో కనిపిస్తుంది. అలాగే, సిలిండర్ ఖాళీగా ఉన్నప్పుడు, ఈ రంగు క్రమంగా పసుపు రంగులోకి మారుతుంది. అంటే ఏ సమయంలోనైనా గ్యాస్ అయిపోతుందని గుర్తించుకోవాలి. దీంతో మనకు సప్లై చేసిన గ్యాస్‌ సిలిండర్‌ నిండుగా వచ్చిందా..? లేదంటే సగం వరకు మాత్రమే ఫిల్‌ చేశారా అనేది తెలుసుకోవచ్చు.
Subhash Goud
|

Updated on: Aug 01, 2024 | 10:35 AM

Share

బడ్జెట్ తర్వాత సామాన్య ప్రజలు షాక్‌ ఇచ్చాయి గ్యాస్‌ సిలిండర్‌ కంపెనీలు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.8.50 పెంచాయి. కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. కానీ 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను పెంచాయి. IOCL వెబ్‌సైట్ ప్రకారం.. ఈ మారిన రేట్లు ఈరోజు అంటే ఆగస్టు 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి.

ఈరోజు ఆగస్ట్ నెల మొదటి రోజు. ఎల్‌పిజి సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన నిర్ణయిస్తారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేటి నుంచి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.8.50 పెంచాయి. ఢిల్లీలో ధర రూ.1652.50గా మారింది. ఈ సిలిండర్ కోల్‌కతాలో రూ.1764.50కి అందుబాటులో ఉంటుంది. ఈ సిలిండర్ ముంబైలో రూ.1605, చెన్నైలో సిలిండర్ ధర రూ.1817కి చేరింది. హైదరాబాద్‌లో రూ.1872 గా ఉంది.

ఇది కూడా చదవండి: Gas Cylinder: గ్యాస్ సిలిండర్ గురించి ముఖ్యమైన ప్రకటన.. తప్పక తెలుసుకోండి!

ఇవి కూడా చదవండి

దేశీయంగా 14 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు:

14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇది ఢిల్లీలో రూ. 803, కోల్‌కతాలో రూ. 829, ముంబైలో రూ. 802.50, చెన్నైలో రూ. 818.50గా ఉంది. సాధారణ కస్టమర్లకు ఢిల్లీలో దీని ధర రూ. 803 ఉండగా, హైదరాబాద్‌లో రూ.855గా ఉంది. అదే ఉజ్వల లబ్ధిదారులకు దీని ధర రూ. 603గా ఉంది.

జూలై 1న రేట్లు:

జూలై 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.30 తగ్గింది. ఢిల్లీలో రూ.1646, కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.1756, ముంబైలో సిలిండర్ రూ.1598, చెన్నైలో సిలిండర్ రూ.1809గా ఉంది.

జూన్ 1న గ్యాస్ సిలిండర్ ధర

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.72 తగ్గించాయి. ఆ తర్వాత ఢిల్లీలో రూ.1676, కోల్‌కతాలో రూ.1787, ముంబైలో రూ.69.50 తగ్గి రూ.1629, చెన్నైలో సిలిండర్ రూ.1840.50కి చేరింది.

ఇది కూడా చదవండి: AP News: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. ఇది కదా కావాల్సింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!