AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ransomware: దేశంలో నిలిచిపోయిన పలు బ్యాంకుల యూపీఐ సేవలు, అసలు కారణం ఏంటో తెలుసా.?

భారతదేశంలోని పలు బ్యాంకులకు టెక్నికల్ సపోర్ట్ అందించే ప్రముఖ టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌ వేర్‌ దాడి జరిగింది. ఈ కారణంగా దేశంలోని సుమారు 300 స్థానిక బ్యాంకులపై ప్రభావం పడింది. దీంతో పలు బ్యాంకుల చెల్లింపు వ్యవస్థులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దేశంలోని పలు చిన్న చిన్న బ్యాంకులకు సి-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ టెక్‌ సపోర్ట్ అందిస్తోంది...

Ransomware: దేశంలో నిలిచిపోయిన పలు బ్యాంకుల యూపీఐ సేవలు, అసలు కారణం ఏంటో తెలుసా.?
Ransomware Attack
Narender Vaitla
|

Updated on: Aug 01, 2024 | 7:22 AM

Share

ప్రస్తుతం దేశంలో యూపీఐ వినియోగం భారీగా పెరిగిపోయింది. డిజిటల్‌ చెల్లింపులు అనివార్యంగా మారిపోయి. ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపించాలంటే బ్యాంకుకు వెళ్లి, ఫామ్‌ నింపి, లైన్‌లో నిలబడే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం రోజులు మారిపోయాయి క్షణాల్లో, ఒక క్లిక్‌తో డబ్బులు పంపించుకుంటున్నారు. అనివార్యంగా మారిన ఈ సేవల్లో అంతరాయం ఏర్పడితే ఎలా ఉంటుంది.? ప్రస్తుతం దేశంలో కొందరు బ్యాంకు యూజర్లు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. గడిచిన రెండు రోజులుగా కొన్ని బ్యాంకులకు చెందిన యూపీఐ సేవలు పనిచేయడం లేదు. అయితే దీనిని అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలోని పలు బ్యాంకులకు టెక్నికల్ సపోర్ట్ అందించే ప్రముఖ టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌ వేర్‌ దాడి జరిగింది. ఈ కారణంగా దేశంలోని సుమారు 300 స్థానిక బ్యాంకులపై ప్రభావం పడింది. దీంతో పలు బ్యాంకుల చెల్లింపు వ్యవస్థులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దేశంలోని పలు చిన్న చిన్న బ్యాంకులకు సి-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ టెక్‌ సపోర్ట్ అందిస్తోంది. ఈ సంస్థపైనే ర్యాన్సమ్‌ వేర్‌ దాడి జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు సిఎడ్స్‌ కానీ, ఆర్‌బీఐ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

ఇక దేశంలో యూపీఐ సేవలను పర్యవేక్షించే.. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ర్యాన్సమ్‌వేర్‌ దాడి ఘటన తమ దృష్టికి వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌ వేదికగా ఓ ట్వీట్ చేసింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని తెలిపిన ఎన్‌పీసీఐ. .. కోపరేటివ్‌, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు టెక్నాలజీ సేవలు అందించే సి-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి ఘటనతో కొన్ని చెల్లింపు వ్యవస్థలపై ప్రభావం పడినట్లు పేర్కొంది.

ఇందులో భాగంగాఏ మిగతా చెల్లింపుల వ్యవస్థలపై దీని ప్రభావం పడకుండా ఉండేందుకు రిటైల్‌ పేమెంట్స్‌ సిస్టమ్‌తో సి-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ను తాత్కాలికంగా వేరుచేసినట్లు తెలిపింది. సీ ఎడ్స్‌ సేవలు అందిస్తున్న సదరు బ్యాంకులు ఈ ఐసోలేషన్‌ సమయంలో సేవుల పొందలేరని పేర్కొంది. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, అవసరమైన సెక్యూరిటీ రివ్యూ జరుపుతున్నట్లు చెప్పింది. చెల్లింపులు నిలిచిపోయిన బ్యాంకులు సాధ్యమైనంత త్వరగా పనిచేస్తాయని స్పష్టం చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..