ఏంటీ ఈ విచిత్రం.. కర్ణాటక పోలీసులను అదుపులోకి తీసుకున్న కేరళ పోలీసులు
ఎక్కడైనా దొంగలను, క్రిమినల్స్‌ను పోలీసులు అరెస్టు చేస్తారు. తీసుకెళ్లి జైల్లో వేస్తారు. కానీ పోలీసులే ఇతర పోలీసులను అదుపులోకి తీసుకోవడం ఎక్కడైనా చూశారా ?. అలాంటి ఘటనే కేరళలో జరిగింది. కర్ణాటక పోలీసులను.. కేరళ పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని ఇటీవల ఆన్‌లైన్ క్రిప్టోకరెన్సీ మోసం జరిగింది. ఫిర్యాదు మేరకు కర్ణాటక పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

ఎక్కడైనా దొంగలను, క్రిమినల్స్‌ను పోలీసులు అరెస్టు చేస్తారు. తీసుకెళ్లి జైల్లో వేస్తారు. కానీ పోలీసులే ఇతర పోలీసులను అదుపులోకి తీసుకోవడం ఎక్కడైనా చూశారా ?. అలాంటి ఘటనే కేరళలో జరిగింది. కర్ణాటక పోలీసులను.. కేరళ పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని ఇటీవల ఆన్‌లైన్ క్రిప్టోకరెన్సీ మోసం జరిగింది. ఫిర్యాదు మేరకు కర్ణాటక పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలా వారి కోసం వెతుకుతుండగా వారు కేరళలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆగస్టు 1వ తేదిన కర్ణాటకకు చెందిన ఓ సీఐతో పాటు మరో నలుగురు పోలీసులు కేరళలోని కొచ్చికి వచ్చారు. ఇక ఈ క్రిప్టోకరెన్సీ మోసం కేసుకు సంబంధించి అఖిల్, నిఖిల్ అనే ఇద్దరు నిందితుల్ని వారు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ నిందితులు మాత్రం తమను విడిచిపెట్టాలని.. కావలంటే డబ్బులు ఇస్తామని పోలీసులతో అన్నారు. దీంతో ఆ పోలీసులు వాళ్లని విడిచిపెట్టాలంటే 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీంతో ఒక నిందితుడు లక్ష రూపాయలు.. మరో నిందితుడు 2.95 లక్షల రూపాయల ఆ కర్ణాటక పోలీసులకు ఇచ్చేశారు. ఆ తర్వాత కర్ణాటక పోలీసులు తమ బెదిరించి లంచంగా మా నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఒక నిందితుడు తన ప్రియురాలి ద్వారా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. దీంతో రంగంలోకి దిగిన కేరళ పోలీసులు కర్ణాటక పోలీసుల కోసం గాలించారు. చివరికి వారిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆ కర్ణాటక పోలీసుల వాహనంలో ఉన్న 3 లక్షల 95 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుల వద్ద లంచం తీసుకున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తన్నారు. అయితే ఈ విషయం కర్ణాటక పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసింది. ఆ రాష్ట్రానికి చెందిన ఓ సినియర్ పోలీస్ అధికారి కొచ్చికి వచ్చారు. కర్ణాటక పోలీసులను అదుపులోకి తీసుకున్నటువంటి కేరళ పోలీసులతో ఆయన ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం..