Water Disputes: ఆ రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం.. కొత్త రిజర్వాయర్ నిర్మాణంతో పీక్స్‌కు చేరిన రచ్చ..
Water Disputes: తమిళనాడు.. కర్ణాటక ప్రస్తావన రాగానే ముందుగా కావేరి నదీజలాల అంశం గుర్తుకొస్తుంది.. అలాగే కావేరి పేరు చెప్పినా రెండు రాష్ట్రాల మధ్య రచ్చ చర్చ తప్పకుండా వస్తుంది.. కావేరి జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం.. వాటి ఉల్లంఘన.. దానికి సంబంధించిన వివాదం షరా మామూలే.. ప్రతి ఏడాది ఈ రచ్చ తప్పదు.. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఉన్నా రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్న సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు.. చర్చలు.. సంప్రదింపులు ఏవి పనిచేయవు.

Karnataka vs Tamil Nadu Water Disputes: తమిళనాడు.. కర్ణాటక ప్రస్తావన రాగానే ముందుగా కావేరి నదీజలాల అంశం గుర్తుకొస్తుంది.. అలాగే కావేరి పేరు చెప్పినా రెండు రాష్ట్రాల మధ్య రచ్చ చర్చ తప్పకుండా వస్తుంది.. కావేరి జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం.. వాటి ఉల్లంఘన.. దానికి సంబంధించిన వివాదం షరా మామూలే.. ప్రతి ఏడాది ఈ రచ్చ తప్పదు.. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఉన్నా రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్న సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు.. చర్చలు.. సంప్రదింపులు ఏవి పనిచేయవు.. చివరకు సుప్రీంకోర్టు దాకా వెళ్లినా అమలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ.. కావేరి జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య జరిగే పోరు.. ఓ మినీ ప్రపంచ యుద్దంలా ఉంటుంది.. ఇక్కడి వాహనాలు అక్కడ.. అక్కడి వాహనాలు ఇక్కడ కనబడితే తగులబెట్టిన సందర్భాలు ఎన్నో… TN, KA రిజిస్ట్రేషన్ నంబరు ప్లేట్ ఉన్న వాహనాలు కనబడితే పరస్పరం తగులబెట్టిన ఉదాహరణలు ఎన్నో.. ఇలాంటి దారుణమైన పరిస్థితులు కావేరి జలాల విషయంలో నిత్యం మామూలే.
ఇప్పుడు అదే కావేరి జలాల కేంద్రంగా మారో కొత్త వివాదం మొదలైంది.. ఇది ఇప్పుడే మొదలైనా ఎక్కడి దాకా వెళుతుందో తెలియని పరిస్థితి.. తమిళనాడు కర్ణాటక సరిహద్దు.. తమిళనాడు నుంచి నాలుగు కి.మీ దూరంలో కర్ణాటక కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టింది.. కావేరి నదిపై మేఘదాతు వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది కర్ణాటక ప్రభుత్వం.. దీనిపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా తప్పు బడుతోంది.. ఇది కర్ణాటక ప్రభుత్వ దుర్మార్గపు చర్యగా చెబుతోంది.. కేవలం తమిళనాడు కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రాజెక్టును కట్టడం ఏంటని ప్రశ్నిస్తోంది.. కావేరి నుంచి తమిళనాడుకు ఏటా ఉన్న వాటా 177 టీఎంసీల నీరు.. అయితే కర్ణాటకలో వరదల సమయంలో మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తుంది కర్ణాటక. అలా మిగులు జలాలను అనువైన రిజర్వాయర్లు, డ్యామ్ లలో నిల్వ చేసుకుంటూ వస్తోంది తమిళనాడు ప్రభుత్వం.. ఇపుడు తమిళనాడు కు అత్యంత దగ్గరగా మరో రిజర్వాయర్ నిర్మాణం జరిగితే వరద సమయంలో వచ్చే మిగులు జలాలు కూడా కర్నాటక భూభాగంలోనే ఉండిపోతాయి. దీంతో తమిళనాడుకు నష్టం జరుగుతుందని ఈ ప్రాజెక్టును ఆపాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
అయితే కావేరి నదిపై మరో రిజర్వాయర్ మేఘదాతు డ్యాం ప్రాజెక్టు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
దాదాపు రూ.9,000 కోట్ల పెట్టుబడితో రిజర్వాయర్, తాగునీటి ప్రాజెక్టుకు కర్ణాటక సర్కార్ ఏర్పాట్లు .




బెంగళూరుకు 90 కి.మీ, కర్ణాటక-తమిళనాడు సరిహద్దులకు 4 కి.మీ దూరంలో రామనగర జిల్లాలోని మేఘదాతు వద్ద రిజర్వాయర్‌ను నిర్మించాలని 2019లో కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక
కావేరి దాని ఉపనది అర్కావతితో కలిసే ప్రదేశంలో కర్ణాటక సర్కార్ ఏర్పాట్లు.
బెంగళూరు నగరానికి తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేయడం మరియు సరఫరా చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ,ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 400 మెగావాట్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేసేలా నిర్మాణం
తమిళనాడు సర్కార్ వ్యతిరేకించే అంశాలు ..
కావేరీ నదీ జలాల పంపకం విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య చాలా కాలంగా వివాదం ఫై సుప్రీం కోర్ట్ కీలక ఉత్తర్వులు.
తమిళనాడు అనుమతి లేనిదే కావేరీ నదిపై డ్యామ్ నిర్మించే అధికారం లేదని సుప్రీం కోర్ట్ తీర్పు .
కర్ణాటక భూభాగం లోని చివరి ప్రాంతం మేఘతాదు ,ఇక్కడ నుండి తమిళనాడుకు కావేరి నీరు ప్రవహిస్తుంది.
ప్రస్తుతం ఇక్కడ డ్యాం లేనందున అక్కడి నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా తమిళనాడుకు నీరు చేరుతోందని, అయితే మేఘదాదు డ్యాం ప్రాజెక్టు ద్వారా ఈ నీటి ప్రవాహాన్ని కర్ణాటక సర్కార్ అడ్డుకుంటుంది.
డ్యామ్ నిర్మాణం జరిగితే కర్ణాటక మిగిలిన నీటిని మాత్రమే తమిళనాడుకు విడుదల చేస్తుందని, అందుకే తమిళనాడు రాష్ట్రం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోందని అసెంబ్లీ లో స్టాలిన్ సర్కార్ తీర్మానం .
రిజర్వ్ ఫారెస్ట్‌లు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలపై ప్రభావం చూపే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల వల్ల పర్యావరణానికి పూర్తి నష్టం కలుగుతుందని తమిళనాడు అభ్యంతరం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..