Air india Flight: ఉల్లిపాయ దెబ్బకు వెనక్కి మళ్లిన విమానం.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సాధారణంగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఏదైన సాంకేతిక సమస్యలు, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు విమానాల దారి మళ్లించడం లేదా దగ్గర్లోని విమానశ్రయంలో ల్యాండింగ్ చేయించడం లాంటివి చేస్తుంటారు. అయితే ఈసారి మాత్రం ఓ విచిత్రన ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఘాటు వాసన రావడంతో అత్యవసరంగా వెనక్కి మళ్లించారు.

సాధారణంగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఏదైన సాంకేతిక సమస్యలు, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు విమానాల దారి మళ్లించడం లేదా దగ్గర్లోని విమానశ్రయంలో ల్యాండింగ్ చేయించడం లాంటివి చేస్తుంటారు. అయితే ఈసారి మాత్రం ఓ విచిత్రన ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఘాటు వాసన రావడంతో అత్యవసరంగా వెనక్కి మళ్లించారు. ఓ బాక్సులో ఉన్న ఉల్లి/కూరగాయలే ఇందుకు కారణం అవ్వడం విశేషం. కొచ్చి నుంచి షార్జాకు బయలుదేరిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కొచ్చి నుంచి షార్జాకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆగస్టు 2న రాత్రికి బయలుదేరింది. ఆ ఫ్లైట్‌లో మొత్తం 175 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానం ఎగిరిన కొద్దిసేపటకి ఏదో ఘాటు వాసన వస్తుందని ఓ ప్రయాణికుడు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని వెనక్కి మళ్లిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయంతో ప్రయాణికులు మరింత ఆందోళన చెందారు. అయితే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యాక ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తర్వాత ఇంజినీరింగ్ బృందాలు వచ్చి విమానాన్ని చెక్ చేశాయి. పొగ లేదా సాంకేతిక సమస్య చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేవు. చివరికి విమానంలోని సరకు రవాణా విభాగంలో ఉల్లి లేదా కూరగాయాల బాక్స ఆ ఘాటు వాసనకు కారణమని గుర్తించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించి అదే విమానంలో షార్జాకు వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కులల్‌నాదన్ స్పందించారు. ఘాటు వాసన వచ్చిన సమయంలో విమానంలో గందరగోళం నెలకొందని చెప్పారు. చివరకి ఫ్లైట్‌ను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరం ఊపిరి పీల్చకున్నామని చెప్పారు. దీనిపై ఆ విమాన సంస్థ కూడా స్పందించింది. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. కార్గొలో పెట్టిన ఉల్లి లేదా కురగాయల నుంచే ఆ ఘాటు వాసన వచ్చి ఉండొచ్చని వెల్లడించింది. అయితే సాధారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో కూరగాయలు, పండ్లను భారీ ఎత్తులో తరలిస్తుంటారు.