- Telugu News Photo Gallery PM Kisan Samman Nidhi 14th Installment Amount Not Credited in Account, Follow These Steps for Get Funds
PM-Kisan Samman Nidhi: పీఎం కిసాన్ 14వ వాయిదా ఇంకా మీ అకౌంట్‌లో పడలేదా? వెంటనే ఈ పని చేయండి..
PM-Kisan Samman Nidhi: రైతులకు బాసటగా నిలిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటికే 13 విడుతలుగా నిధులు రైతుల ఖాతాల్లో పడగా.. ఇటీవల 14వ విడత నిధులు కూడా జమ అయ్యాయి. అయితే, కొంత మంది రైతులు ఈ 14వ విడత నిధులను అందుకోలేదు. మరి వారు ఎలా ఈ నిధులను పొందాలో ఇవాళ మనం తెలుసుకుందాం..
Updated on: Aug 03, 2023 | 2:17 PM

జులై 27వ తేదీన రాజస్థాన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 14వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను విడుదల చేశారు. ఈ దఫా 8.5 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ నిధులను అందుకున్నారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత నిధులు మొత్తం విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే, కొందరు రైతులకు మాత్రం 14 విడత నిధులు మంజూరవలేదు. దాంతో వారు ఆందోళనలో ఉన్నారు. నిధులు విడుదలై 7 రోజులు గడుస్తున్నా.. తమ అకౌంట్లో డబ్బు జమ కాకపోవడంతో కంగారుపడుతున్నారు.

అయితే, డబ్బులు రాలేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. రైతులు ఇంట్లో కూర్చొనే 14వ విడత నిధుల ఎందుకు అకౌంట్‌లో పడలేదో తెలుసుకోవచ్చు. అంటే తమ అకౌంట్ స్టేటస్‌ని పరిశీలించడం ద్వారా దీనిని తెలుసుకోవచ్చు.

రైతులు ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inని సందర్శించాలి. ఆ తరువాత మీ స్టేటస్‌ని చెక్ చేసుకోవడం కోసం ‘స్టేటస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

ఆ తరువాత గెట్ డేటా అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే 14 విడత నిధులకు సంబంధించిన సమాచారం మొత్తం మీ కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ వివరాలను చెక్ చేసుకుని, కారణం ఏంటో తెలుసుకోవచ్చు. అందులో ఏమైనా తేడా కనిపిస్తే వెంటనే సరి చేసుకోవాలి. లబ్దిదారుల జాబితాలో మీ పేరు, బ్యాంక్ ఖాతా వివరాలను తప్పుగా నింపినట్లయితే 14వ విడత నిధులు మంజూరు అవవు. వెంటనే ఆ వివరాలను సరి చేసుకోవాలి.