AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaravati Lands: R5జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే.. ఇళ్ల నిర్మాణం వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు

Amaravati News: ఏఏపీ రాజధాని అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలివేయాలని కోరుతూ రైతులు వేసిన పిటీషన్‌పై జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం తీర్పు ఇవ్వనుంది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు, 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతులు హైకోర్టులో కేసులు వేసింది.

Amaravati Lands: R5జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే.. ఇళ్ల నిర్మాణం వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు
Amaravati Lands
Sanjay Kasula
|

Updated on: Aug 03, 2023 | 11:23 AM

Share

అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం. వెంటనే ఇళ్ల నిర్మాణం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ఆర్‌-5 జోన్‌లో జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వాలని ఉద్దేశ్యంతో ఇళ్ల పట్టాలను అందజేసింది ఏపీ ప్రభుత్వం. రాజధాని ప్రాంతంలో సుమారు 14 వందల ఎకరాల మేర పంపిణీ చేసింది.  అమరావతిలో 50 వేల 793 మందికి ఏపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ పత్రాలు మంజూరు చేసింది.

ఇది ఎలక్ట్రానికి సిటీ కావున ఇక్కడ కాకుండా మరోచోట ఇవ్వాలనంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, రాజధాని ప్రాంతంలో 5 శాతం పేదలకు ఇళ్లు కట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని.. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఇక్కడ జరగడం లేదని కోర్టుకు విన్నవించుకున్నారు రాజధాని రైతులు. హైకోర్టు ఇచ్చిన  స్టే ఆర్డర్‌పై అధికార వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం