Crime News: నోట్లో డిటోనేటర్ పేల్చి వివాహితను చంపిన ప్రియుడు
కర్ణాటకలోని సాలిగ్రామలో ఉన్న లాడ్జిలో వివాహిత దారుణ హత్యకు గురైంది. నోటిలో పేలుడు పదార్థాలు ఉంచి పేల్చడం ద్వారా ఆమెను ప్రియుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు సిద్ధరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ...

కర్నాటక మైసూర్ జిల్లా సాలిగ్రామ్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల దర్శిత అనే యువతిని ఆమె ప్రియుడు సిద్దరాజు లాడ్జిలో హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దర్శిత నోట్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ పేల్చి హత్య చేసిన ఘటన అందరిని షాక్‌కు గురిచేసింది. పేలుడు ధాటికి దర్శిత ముఖం ఛిద్రమయ్యింది. గుర్తుపట్టని రీతిలో ఆమె ముఖం మారిపోయింది. దర్శితకు రెండేళ్ల క్రితమే కేరళలోని కన్నూరు జిల్లా పడియూర్‌కు చెందిన సుభాష్‌తో పెళ్లి జరిగింది. దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు సుభాష్. పెళ్లికి ముందే సిద్దరాజుతో లవ్‌లో ఉంది. పెళ్లి తరువాత కూడా సిద్దరాజుతో వివాహేతర సంబధం కొనసాగుతున్నట్టు గుర్తించారు. దర్శితకు రెండేళ్ల కూతురు కూడా ఉంది.
రెండు రోజుల క్రితం కూతురితో సహా సడెన్‌గా అదృశ్యమయ్యింది దర్శిని. పుట్టింటికి వెళ్లిపోయినట్టు అత్తింటివాళ్లు అనుమానించారు. ఇంట్లోని నగలు, నగదు ఆమె తీసుకెళ్లి ఉండొచ్చని పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే సాలిగ్రామ్ లాడ్జిలో దర్శిత శవమై తేలడం తీవ్ర సంచలనం రేపింది. మొబైల్ ఫోన్ పేలడంతో ఆమె చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు సిద్దరాజు. కాని పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నోట్లో డిటోనేటర్ పెట్టి , ఫోన్ ఛార్జర్ వైర్‌కు కనెక్ట్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తించారు.
Also Read: “నీలాంటి తండ్రి ఏ కూతురికీ ఉండడు.. వాడ్ని మాత్రం అస్సలు వదలొద్దు నాన్న”
అయితే సిద్దరాజు ఎందుకు ఈ హత్య చేశాడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్శిని తనతో 22 లక్షల విలువైన నగలు , 4 లక్షలు తీసుకెళ్లినట్టు ఆమె అత్తింటివాళ్లు చెబుతున్నారు. సిద్దరాజు దగ్గర డబ్బు లభించలేదని పోలీసులు తెలిపారు. సిద్దరాజుకు దర్శిని 80 వేలు అప్పు ఇచ్చినట్టు తెలుస్తోంది. కాకపోతే వచ్చే నెల దుబాయ్‌లో ఉన్న తన భర్త దగ్గరకు వెళ్తానని దర్శిత చెప్పడంతో సిద్దరాజు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




