AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: అక్కడ థియేటర్లలో సినిమా చూడాలంటే.. వ్యాక్సిన్ తప్పనిసరి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..

కర్ణాటక రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూడటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు కఠిన...

Omicron: అక్కడ థియేటర్లలో సినిమా చూడాలంటే.. వ్యాక్సిన్ తప్పనిసరి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..
Theatres
Ravi Kiran
|

Updated on: Dec 03, 2021 | 5:22 PM

Share

కర్ణాటక రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూడటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు కఠిన ఆంక్షలను విధించేందుకు సిద్దమైంది. ఈ నేపధ్యంలో ఒమిక్రాన్ వైరస్‌పై ఇటీవల కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఇలా ఉన్నాయి..

1. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి మాత్రమే సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, పార్కుల్లోకి అనుమతి.

2. తల్లిదండ్రులు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకునేవరకు విద్యార్ధులు ఆఫ్‌లైన్ క్లాసులకు హాజరు కాకూడదు.

3. అన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు 2022 జనవరి 15వ తేదీ వరకు వాయిదా వేయాలంటూ పాఠశాలలు, యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ.

4. విదేశాల నుంచి వచ్చినవారికి కోవిడ్ టెస్టులు తప్పనిసరి. రిపోర్ట్స్ వచ్చేవరకు ఎయిర్ పోర్టులలోనే ఉండాలి.

కాగా, ఇప్పటికే బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరికి కాంటాక్ట్ అయిన ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అది ఒమిక్రానా.? కాదా.? అనేది తెలుసుకునేందుకు శాంపిల్స్‌ను జీనోమ్ స్వీక్వెనింగ్ ల్యాబ్‌కు పంపించారు.

ఇవి కూడా చదవండి:

14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?

IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!