Karnataka Elections: రంజుగా కర్నాటక రాజకీయం.. వేగంగా పార్టీలు మార్చేస్తున్న నేతలు..
కర్నాటక ఎన్నికల్లో టిక్కెట్లు దొరకని నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. చివరిక్షణంలో తనకు బీజేపీ టిక్కెట్ లభిస్తుందన్న ఆశలో ఉన్నారు మాజీ సీఎం జగదీశ్ శెట్టార్. టిక్కెట్ లభించని నేతలు రాత్రికి రాత్రి పార్టీలు మార్చేస్తున్నారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇచ్చామని స్పష్టం చేశారు సీఎం బస్వరాజ్ బొమ్మై.
కర్నాటక ఎన్నికల్లో టిక్కెట్లు దొరకని నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. చివరిక్షణంలో తనకు బీజేపీ టిక్కెట్ లభిస్తుందన్న ఆశలో ఉన్నారు మాజీ సీఎం జగదీశ్ శెట్టార్. టిక్కెట్ లభించని నేతలు రాత్రికి రాత్రి పార్టీలు మార్చేస్తున్నారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇచ్చామని స్పష్టం చేశారు సీఎం బస్వరాజ్ బొమ్మై.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మైండ్‌గేమ్ కొనసాగుతోంది. కర్నాటక ఎన్నికల ముందు జంపింగ్స్ కహానీలో మరో ట్విస్ట్ ఇది. కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ తిమ్మప్ప కూతురు రాజనందిని బీజేపీలో చేరారు. తన బిడ్డ పార్టీ మారుతుందని తాను ఊహించలేదన్నారు ఆమె తండ్రి తిమ్మప్ప. దీని వెనక ఏదో ఉందని చెప్పారాయన. అయితే కాంగ్రెస్ తనకు టికెట్ ఇవ్వలేదనీ, తాను కష్టపడినా గుర్తించకపోవడంతోనే పార్టీ మారినట్లు రాజనందిని చెప్పారు.
మరోవైపు ఈసారి కూడా తనకు తప్పకుండా బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం లభిస్తుందని అంటున్నారు మాజీ సీఎం జగదీశ్ శెట్టార్. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో జగదీశ్ శెట్టార్ భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను పోటీ చేస్తానని తెలిపారు. హుబ్లీ నుంచి జగదీశ్ శెట్టార్‌కు మళ్లీ పోటీ చేసే అవకాశం కచ్చితంగా లభిస్తుందని తెలిపారు యడియూరప్ప.
బీజేపీ టిక్కెట్లు లభించిన నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చామని స్పష్టం చేశారు సీఎం బస్వరాజ్ బొమ్మై. బీజేపీ 52 మంది కొత్తవారికి అవకాశం కల్పించింది. దీంతో పార్టీలో అసమ్మతి మొదలైంది. టికెట్ దక్కని నేతలు పార్టీ నుంచి వీడేందుకు సిద్ధమవుతున్నారు.
189 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా..
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరుగుతాయి. 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో 52 మంది కొత్తవారికి ఈ సారి అవకాశం కల్పించింది. అయితే ఎన్నికల వేళ సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్. ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో అక్రమ ఓటర్లను చేర్పించారని. బెంగళూర్ లోనే 40 వేల మంది నకిలీ ఓటర్ల జాబితాను గుర్తించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్టు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..