కర్ణాటకలో 100 బెడ్స్ తో పీడియాట్రిక్ ఐసీయూ …..ప్రారంభించిన డిప్యూటీ సీఎం అశ్వత్థనారాయణ్…
థర్డ్ కోవిద్ ముప్పు ఉందన్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లల కోసం 100 బెడ్స్ తో కూడిన ఐసీయూను బెంగుళూరులో డిప్యూటీ సీఎం అశ్వత్థ నారాయణ్ ప్రారంభించారు. రూ.1.32 కోట్లతో దీన్ని నిర్మించామని, కోవిద్ కి గురైన పిల్లలకు ఇక్కడ ఉత్తమ చికిత్స లభిస్తుందని..
థర్డ్ కోవిద్ ముప్పు ఉందన్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లల కోసం 100 బెడ్స్ తో కూడిన ఐసీయూను బెంగుళూరులో డిప్యూటీ సీఎం అశ్వత్థ నారాయణ్ ప్రారంభించారు. రూ.1.32 కోట్లతో దీన్ని నిర్మించామని, కోవిద్ కి గురైన పిల్లలకు ఇక్కడ ఉత్తమ చికిత్స లభిస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో ఆక్సిజెనెటేడ్ బెడ్స్, వెంటిలేటర్లు, అత్యంత ఆధునిక మిషిన్లు, మల్టీ పారా మానిటర్లు ఉన్నట్టు ఆయన చెప్పారు. ముఖ్యంగా పేద పిల్లలకు ఈ పీడియాట్రిక్ వార్డులు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. బహుశా దేశంలో ఇదే మొదటి పీడియాట్రిక్ ఆసుపత్రి అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇక్కడ దివ్యాంగ పిల్లలకు వ్యాక్సినేషన్, సౌకర్యం ఉంటుందని ఎండీ రాజేష్ నంబియార్ తెలిపారు. పాండమిక్ సమయంల్లో పిల్లలుడిజిటల్ లెర్నింగ్ వెసులుబాటు కూడా ఉందన్నారు.
కాగా థర్డ్ వేవ్ కారణంగా పిల్లలకు పెద్ద ముప్పు ఉండకపోచ్చునని నిపుణులు చెబుతున్నప్పటికీ కర్ణాటక ముందు జాగ్రత్త చర్యగా ఈ ఆధునిక పీడియాట్రిక్ ఆసుపత్రిని ప్రారంభించడం విశేషం. అటు పిల్లలపైవ్యాక్సిన్ ట్రయల్స్ ఇంకా సాగుతున్నాయి. వీటి ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఢిల్లీలో తామే మొదట ఈ విధమై న పీడియాట్రిక్ ఆసుపత్రులను ప్రారంభిస్తామని లోగడ ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రేవాల్ ప్రకటించారు. ఇందుకు పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కానీ మళ్ళీ ఆయన నుంచి ఇందుకు సంబంధించి ప్రకటన ఏదీ రాలేదు., ఆయన ప్రధానంగా వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టడమే ఇందుకు కారణంగా కనిపిస్తోందంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : ఆకట్టుకుంటున్న రెడీమేడ్ హౌస్..తక్కువ ఖర్చుతో ఎక్కువ సదుపాయాలతో కదిలే ఇల్లు..(వీడియో): Readymade House Video.