PM Modi: సినీ లెజెండ్ రాజ్ కపూర్ శత జయంతి వేడుకలు.. ప్రధాని మోదీని కలిసిన కపూర్ ఫ్యామిలీ

ప్రధాని నరేంద్ర మోదీని కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. సినీ లెజెండ్ రాజ్‌ కపూర్ శత జయంతి సందర్బంగా ప్రధాని మోదీని కలిసి శతజయంతి వేడుకలకు ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ స్వయంగా పంచుకున్నారు.

PM Modi: సినీ లెజెండ్ రాజ్ కపూర్ శత జయంతి వేడుకలు.. ప్రధాని మోదీని కలిసిన కపూర్ ఫ్యామిలీ
Pm Modi With Kapoor Family
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 11, 2024 | 7:17 PM

ప్రధాని నరేంద్ర మోదీని కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. సినీ లెజెండ్ రాజ్‌ కపూర్ శత జయంతి సందర్బంగా ప్రధాని మోదీని కలిసి శతజయంతి వేడుకలకు ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ స్వయంగా పంచుకున్నారు. సినీ లెజెండ్ రాజ్ కపూర్ 100 సంవత్సరాల వేడుకల సందర్భంగా కపూర్ కుటుంబంతో పత్యేకంగా మాట్లాడినట్లు ప్రధాని మోదీ రాశారు.. ప్రధాని నరేంద్ర మోడీని కపూర్ కుటుంబానికి చెందిన ప్రముఖులంతా కలిసి ఆప్యాయంగా మాట్లాడారు.. రాజ్ కపూర్ 100వ జయంతి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలువైన బహుమతిని కూడా ఇచ్చారు..

భారతీయ సినిమాకు కపూర్ కుటుంబం అందించిన సహకారం అపారమైనది. కపూర్ కుటుంబానికి చెందిన పృథ్వీరాజ్ కపూర్ బాలీవుడ్‌కు పునాది వేశారు.. ఇది ఇప్పుడు గర్వంగా మారింది. పృథ్వీరాజ్ కపూర్ కుమారుడు రాజ్ కపూర్ భారతదేశపు మొదటి సూపర్ స్టార్ అయ్యారు.. హిందీ సినిమా ఎదుగుదలకు ఆయన చేసిన కృషి ఎనలేనిది.

కపూర్ ఫ్యామిలీతో ప్రధాని మోదీ .. వీడియో

ఇప్పుడు కపూర్ కుటుంబం రాజ్ కపూర్ శత జయంతిని ఘనంగా.. జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది.. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి రాజ్ కపూర్ ఉపయోగించే ఒక వస్తువును బహుమతిగా అందించారు.. 100 ఇయర్స్ ఆఫ్ రాజ్ కపూర్ ఈవెంట్‌ నిర్వహిస్తున్నామని.. ఈ వేడుకకు రావాలంటూ ఆహ్వానించారు..

రాజ్ కపూర్ సినిమా ఉత్సవ్ డిసెంబర్ 13 నుంచి 15 వరకు జరుగుతుంది.. రాజ్ కపూర్ వివిధ ఐకానిక్ సినిమాలు 135 స్క్రీన్లలో ప్రదర్శించబడుతున్నాయి. కపూర్ అభిమానులు మరోసారి రాజ్ కపూర్ సినిమాలను చూడవచ్చు. రాజ్ కపూర్ 100వ జయంతి సందర్భంగా కపూర్ కుటుంబం రాజ్ కపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.. ముంబైతో పాటు భారతదేశంలోని దాదాపు 40 నగరాల్లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది.

రణబీర్ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, నీతూ కపూర్, అలియా భట్, రిధిమా కపూర్, పలువురు నరేంద్ర మోడీని కలుసుకున్నారు.. ఆయనతో ఆప్యాయంగా మట్లాడటంతోపాటు.. ఫొటోలు తీసుకున్నారు.. అంతేకాకుండా మోదీ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

రాజ్ కపూర్ భారతీయ సినిమా షోమ్యాన్ గా పిలుస్తారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. సినిమా కోసం స్టూడియో కూడా నిర్మించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..