Atul Subhash Case: వరకట్న వేధింపుల చట్టం మగాళ్ల పాలిట శాపంగా మారిందా? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..

భార్య నిఖిత సింఘానియా వేధింపులతో బెంగళూర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అతుల్‌ సుభాష్‌ ఉదంతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. వరకట్న వేధింపుల చట్టంపై రివ్యూ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Atul Subhash Case: వరకట్న వేధింపుల చట్టం మగాళ్ల పాలిట శాపంగా మారిందా? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
Atul Subhash
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 12, 2024 | 9:42 AM

వరకట్న వేధింపుల చట్టం మగాళ్ల పాలిట శాపంగా మారిందా? ఈ చట్టం ఎక్కువశాతం దుర్వినియోగం అవుతోందా ? బెంగళూర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అతుల్‌ సుభాష్‌ ఉదంతం తరువాత దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తనపై భార్య 9 తప్పుడు కేసులు పెట్టి వేధించిందని 24 పేజీల లేఖ, సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అతుల్‌ సుభాష్‌.. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది..

భార్య నిఖిత సింఘానియా వేధింపులతో బెంగళూర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అతుల్‌ సుభాష్‌ ఉదంతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. వరకట్న వేధింపుల చట్టంపై రివ్యూ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తప్పుడు కేసులతో భార్యలు వేధిస్తే మగాళ్లు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని ఈ ఘటన రుజువు చేసిందని అంటున్నారు. అతుల్‌ ఆత్మహత్యతో అతడి పేరంట్స్‌ కుప్పకూలిపోయారు. నిఖిత టార్చర్‌ భరించలేకే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు.

వరకట్న వేధింపుల చట్టం దుర్వినియోగం.. సుప్రీంకోర్టు కీలకవ్యాఖ్యలు

వరకట్న వేధింపుల చట్టం దుర్వినియోగం అవుతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయని , కింది కోర్టులు ఈవిషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తిపై వరకట్న వేధింపుల కేసును రద్దు చేయబోమన్న తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. లైవ్ లా నివేదిక ప్రకారం.. జస్టిస్ విక్రమ్ నాథ్ మరియు ప్రసన్న బి వరాలేలతో కూడిన ఉన్నత న్యాయస్థానం బెంచ్ హిందూ జంటకు సంబంధించిన విడాకుల కేసులో తుది భరణం మొత్తాన్ని నిర్ణయించడానికి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. భరణం నిర్ణయించేటప్పుడు 8 అంశాలను పరిగణలోకి తీసుకోవాలని.. అత్యున్నత న్యాయస్థానం సూచించింది.. పార్టీల స్థితి, సామాజిక -ఆర్థిక పరిస్థితి.. భార్య -ఆధారపడిన పిల్లల అవసరాలు, పార్టీల వ్యక్తిగత అర్హతలు-ఉద్యోగ స్థితిగతులు, స్వతంత్ర ఆదాయం లేదా దరఖాస్తుదారు యాజమాన్యంలోని ఆస్తులు, భార్య జీవన ప్రమాణం, కుటుంబ బాధ్యతల కోసం చేసే ఏదైనా ఉపాధి త్యాగం, పని చేయని భార్య కోసం సహేతుకమైన వ్యాజ్యం ఖర్చులు, భర్త ఆర్థిక సామర్థ్యం, ​​అతని ఆదాయం, నిర్వహణ బాధ్యతలు బాధ్యతలు… శాశ్వత భరణం మొత్తాన్ని నిర్ణయించడానికి మార్గదర్శకాలను అనుసరించాలని అన్ని ఇతర కోర్టులకు అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

#MenToo ట్రెండింగ్..

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నా ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. మెన్‌టూ (#MenToo) అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం ఆయన రాసిన 24 పేజీల సూసైడ్ నోట్, మరణానికి ముందు చేసిన ఒక గంట వీడియో రికార్డు.. అతుల్ ఈ ఆత్మహత్యకు తన భార్యే కారణమని, తన భార్య చిత్రహింసల కారణంగానే తాను ఇలాంటి చర్య తీసుకుంటున్నానని చెప్పాడు. తొలుత కోటి రూపాయలు డిమాండ్‌ చేసిన నిఖిత తరువాత రూ. 3 కోట్లు డిమాండ్‌ చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు అతుల్‌.. ఆఖరికి తన మూడేళ్ల కుమారుడిని చూడకుండా చేశారని కన్నీరుమున్నీరయ్యాడు.

‘‘నా భార్యను , ఆమె బంధువులను నా శవం దగ్గరకు రానివ్వకూడదు.. నన్ను వేధించినవాళ్లకు శిక్ష పడే వరకు నా అస్థికలను నిమజ్జనం చేయకూడదు. ఎన్నో సాక్ష్యాలు ఇస్తున్నప్పటికి నన్ను వేధించినవాళ్లకు శిక్ష పడకపోతే నా అస్థికలను కోర్టు ముందే పెట్టాలి’’.. – ఆత్మహత్య చేసుకున్న అతుల్‌ ప్రకాఖ్‌ ఆఖరి మాటలు ఇవి..

ఆత్మహత్యకు ముందు, అతుల్ సుభాష్ తన ల్యాప్‌టాప్‌లో వీడియోను రికార్డ్ చేశాడు, అందులో అతను ఆత్మహత్యకు గల కారణాల గురించి పూర్తి సమాచారం ఇచ్చాడు. అతుల్ ఈ వీడియోను న్యాయమూర్తికి, పోలీసులకు, తన కంపెనీ యజమానికి కూడా పంపాడు. ఇంకా ‘న్యాయం జరగాల్సి ఉంది’ అని క్యాప్షన్ పెట్టాడు. అతుల్ తన 24 పేజీల సూసైడ్ నోట్‌లో ప్రతి పేజీలో ‘న్యాయం ఇంకా అందజేయాల్సి ఉంది’ అని రాశాడు. అతుల్ చేసిన ఈ పని తొందరపాటు నిర్ణయం కాదనిపిస్తోంది. పక్కా ప్లానింగ్‌తో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే, తన మరణానికి ముందు అతను తన కంపెనీకి అన్ని కంప్యూటర్లు, IDలను తిరిగి ఇచ్చాడు. ఇది మాత్రమే కాదు, అతను తన క్రెడిట్ కార్డ్ ఇతర చెల్లింపులను పూర్తి చేశాడు.

ఆత్మహత్య చేసుకునే ముందు అతుల్ ఈమెయిల్ ద్వారా చాలా మందికి సూసైడ్ నోట్ పంపాడు. సన్నిహితుల వాట్సాప్ గ్రూప్‌లో కూడా దానిని పంచుకున్నాడు. అతుల్ సుభాష్ వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ జిల్లాకి చెందినవాడు. సూసైడ్ నోట్‌లో, అతుల్ తన మరణానికి యాక్సెంచర్ ఉద్యోగి అయిన తన భార్య నిఖితా సింఘానియా, ఆమె కుటుంబ సభ్యులను నిందించాడు. తన భార్య నిఖితా సింఘానియా తనను చాలా హింసించిందని అతుల్ తన 24 పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. మగాళ్లను ఇలా వేధించి కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌..

యూపీ కోర్టులో నిఖిత తనపై ఎన్నో కేసులు పెట్టిందన్నాడు అతుల్‌ సుభాష్‌.. ఒకవేళ తాను సూసైడ్‌ చేసుకున్నప్పటికి మనోవర్తి డబ్బులు తన తండ్రి దగ్గర కూడా తీసుకుంటామని బెదరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను రికార్డ్ చేసిన వీడియో, తన సూసైడ్ నోట్‌లో, “ప్రస్తుతం భారతదేశంలో పురుషులపై చట్టపరమైన మారణహోమం జరుగుతోంది” అని ఆరోపించాడు. అతుల్ ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. మెన్‌టూ (#MenToo) అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆయన భార్య నిఖితను వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చట్టంలో పురుషులకు రక్షణ లేదని నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి