Viral: మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.

Viral: మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Dec 12, 2024 | 9:47 AM

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత యువత విచ్చలవిడిగా వీడియోలు చేస్తూ నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. ఇందుకోసం ఎన్నో ప్రమాదకర సాహసాలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలనే పిచ్చితో ప్రాణాలను పణంగా పెడుతున్నారు. లైక్‌లు, కామెంట్లు, వ్యూస్‌ కోసం రెచ్చిపోయి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో వీడియోలు మనం సోషల్‌ మీడియాలో రోజూ చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఓ యువకుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనకేం కాదని, తననెవరూ అడ్డుకోలేరని భావించి కారు బ్యానెట్‌పై కూర్చొని ప్రయాణిస్తూ హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన హర్యణాలో చోటుచేసుకుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ వీడియోలో ఓ యువకుడు మహీంద్రా థార్‌ వాహనం బానెట్‌పై కూర్చుని ప్రయాణించాడు. అతని స్నేహితులు అతన్ని మరికొన్ని కార్లతో అనుసరించారు. ఈ చర్యపై సదరు యువకుడు స్పందిస్తూ.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినా పర్లేదని, పోలీస్ అయిన తన తండ్రి తనను రక్షిస్తాడని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. హర్యానాలో ఏం జరుగుతోందని, కుమారుడు ఇలాంటి ప్రమాదకర, పిచ్చి పనులు చేస్తుంటే తండ్రి అతడిని రక్షిస్తాడా? అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు అతడి తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించాలని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. ఇది చాలా ప్రమాదకరమని, ఓ కుర్రాడు ఇలానే కూర్చుని ప్రయాణిస్తూ స్పీడ్ బ్రేకర్ వద్ద కిందపడి తలపగిలి అక్కడికక్కడే మరణించాడని ఇంకో యూజర్ పేర్కొన్నాడు. యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.కాగా ఈ వీడియో నెల రోజుల క్రితంనాటిదే అయినా… మరోసారి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఏకంగా 3.5 కోట్ల మంది వీక్షించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.