Kamal Haasan: పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ.. ప్రధాని మోదీని ప్రశ్నించిన కమల్ హాసన్

ఈనెల 28 న నూతన పార్లమెంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారనే విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు మాత్రం పార్లమెంట్‌ను రాష్ట్రపతి చేత ప్రారంభించకుండా ప్రధాని చేత చేయించడం ఏంటని విమర్శలు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో రేపు జరిగే ఈ వేడుకకు కూడా పలు విపక్ష పార్టీలు దూరంగా ఉన్నాయి.

Kamal Haasan: పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ.. ప్రధాని మోదీని ప్రశ్నించిన కమల్ హాసన్
Kamal Haasan
Follow us

|

Updated on: May 27, 2023 | 6:31 PM

ఈనెల 28 న నూతన పార్లమెంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారనే విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు మాత్రం పార్లమెంట్‌ను రాష్ట్రపతి చేత ప్రారంభించకుండా ప్రధాని చేత చేయించడం ఏంటని విమర్శలు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో రేపు జరిగే ఈ వేడుకకు కూడా పలు విపక్ష పార్టీలు దూరంగా ఉన్నాయి. చివరికి రాష్ట్రపతికి ఆహ్వనం కూడా పంపకపోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ కొత్త పార్లమెంట్ ప్రారంభంపై తాజాగా ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్‌హాసన్ కూడా స్పందించారు.

దేశ ప్రజలు ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నారని.. దేశం గర్వించదగ్గ ఈ వేడుకకు రాజకీయంగా విభేదాలు తలెత్తాయని తెలిపారు.ఇంతటీ చారిత్రక ఘట్టానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం వెనుక కారణం ఏంటో కనబడటం లేదని అన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీని ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు రాకూడదు ?.. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలని కోరారు. రాష్ట్రపతిని ద్రౌపది ముర్మూని ఆహ్వానించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలను చదవండి..