జీవిత భాగస్వామితో శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వమే.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
జీవిత భాగస్వామి శృంగారానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన కారణం లేకుండా జీవిత భాగస్వామితో ఎక్కవ కాలం పాటు శృంగారానికి నిరాకరించడం కూడా క్రూరత్వం కిందకే వస్తుందని తీర్పునిచ్చింది. ఫ్యామిలీ కోర్టు విడాకుల అభ్యర్థనను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రవీంద్ర యాదవ్ అనే వ్యక్తి వేసిన పిటీషన్‌పై విచారించిన కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది.

జీవిత భాగస్వామి శృంగారానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన కారణం లేకుండా జీవిత భాగస్వామితో ఎక్కవ కాలం పాటు శృంగారానికి నిరాకరించడం కూడా క్రూరత్వం కిందకే వస్తుందని తీర్పునిచ్చింది. ఫ్యామిలీ కోర్టు విడాకుల అభ్యర్థనను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రవీంద్ర యాదవ్ అనే వ్యక్తి వేసిన పిటీషన్‌పై విచారించిన కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఇక వివరాల్లోకి వెళ్తే తనకు 1979లో వివాహం జరిగిందని.. కొంతకాలం తర్వాత తన భార్య తనతో కలిసి ఉండేందుకు నిరాకరించిందని రవీంద్ర నాయక్ ధర్మాసనానికి తెలిపారు. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తనతో లైంగిక సంబంధానికి దూరంగా ఉంటోందని తెలిపారు. అయిచే కొంతకాలం తర్వాత ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయిందని, తిరిగి రావాలని కోరినా ఆమె ఒప్పుకోలేదని తెలిపారు.
అనంతరం 1994లో పెద్దల పంచాయితీ తీర్మానం మేరకు భార్యకు రూ.22 వేలు భరణం చెల్లించి విడిపోయినట్లు వెల్లడించారు. ఆ తర్వాత తన భార్య మరో వివాహం చేసుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో చట్టపరంగా విడాకులు పొందేందుకు వారణాసి ఫ్యామిలీ కోర్టులో రవీంద్ర పిటిషన్ వేశారు. అయితే తన భార్య రెండో వివాహం చేసుకున్నట్లు తగిన ఆధారాలు చూపించలేదని వారణాసి ఫ్యామిలీ కోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. చివరికి రవీంద్ర అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.




పెళ్లయిన తర్వాత పిటిషనర్, ఆయన భార్య చాలా కాలం పాటు విడివిడిగా జీవిస్తున్న విషయాన్ని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ భార్యకు దాంపత్య బంధం మీద గౌరవం లేదని.. ఆమె తన భర్తకు భార్యగా ఉండేందుకు కూడా సుముఖంగా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.అందుకే వారి దాంపత్య జీవితం విచ్ఛిన్నమైనట్లు పేర్కొంది. జీవిత భాగస్వామిని సరైన కారణం లేకుండా ఎక్కువ కాలం లైంగిక చర్యలకు నిరాకరించడం మానసిక క్రూరత్వం కిందే వస్తుందని తెలిపింది.ఎట్టకేలకు రవీంద్ర వివాహ బంధాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
మరిన్ని జాతీయ వార్తలను చదవండి..




