JP Nadda: ఎన్డీయేతో ఖరారైన టీడీపీ, జనసేన పొత్తు.. స్పష్టం చేసిన జేపీ నడ్డా..

తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్డీయేలో చేరినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల యుద్దం హోరా హోరీగా సాగుతోంది. అయితే ఎట్టకేలకు బీజేపీతో పొత్తు అంశంపై స్పష్టత వచ్చింది. దేశ, రాష్ట్ర అభివృద్ది కోసమే కూటమిగా ఏర్పడినట్లు తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో కలిసి పనిచేస్తామని తెలిపారు.

JP Nadda: ఎన్డీయేతో ఖరారైన టీడీపీ, జనసేన పొత్తు.. స్పష్టం చేసిన జేపీ నడ్డా..
Jp Nadda
Follow us
Srikar T

|

Updated on: Mar 09, 2024 | 7:11 PM

తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్డీయేలో చేరినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల యుద్దం హోరా హోరీగా సాగుతోంది. అయితే ఎట్టకేలకు బీజేపీతో పొత్తు అంశంపై స్పష్టత వచ్చింది. దేశ, రాష్ట్ర అభివృద్ది కోసమే కూటమిగా ఏర్పడినట్లు తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు జేపీ నడ్డా. ఎన్డీయేలో చేరాలన్న టీడీపీ, జనసేనల అభిప్రాయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో కలిసి పనిచేస్తామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి ముందుకు వెళ్తాయని చెప్పారు.

ఇదిలా ఉంటే మొన్నటి వరకు టీడీపీ, జనసేన ఇద్దరూ కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 118 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు చంద్రబాబు. అయితే మరిన్ని స్థానాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అలాగే ఒకటి రెండు రోజుల్లో సీట్ల ప్రకటన ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు. దీంతో పాటు ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా త్వరలోనే విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జ‌న‌సేన‌-బీజేపీకి 30 అసెంబ్లీ సీట్లు, 8 లోక్ స‌భ స్థానాలు కేటాయించిన‌ట్లు చెప్పారు. అయితే ఇప్ప‌టికే జ‌న‌సేన 24 అసెంబ్లీ, 3 లోక్ స‌భ స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. ఈ లెక్క ప్ర‌కారం చూస్తే 6 అసెంబ్లీ, 5 పార్ల‌మెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..