PM Modi: ప్రతీ ఒక్కరూ ఈ ప్రాంతాన్ని సందర్శించాలి.. ప్రజలకు మోదీ పిలుపు

ఈ సందర్భంగా ప్రధాని జాతీయ పార్క్‌ను సందర్శించి అక్కడ ఏనుగు సఫారీ చేశారు. కెమెరాతో జంతువులను, ప్రృకృతి అందాలను కెమెరాలో చిత్రీకరించారు. 1957 తర్వాత ఈ పార్క్‌ను సందర్శించిన తొలి ప్రధాని మోదీ కావడం విశేషం. అలాగే జీపులో సఫారీ చేశారు. ఈ సమయంలో ప్రధాని వెంట పార్క్‌ డైరెక్టర్‌ సొనాలీ ఘోష్‌...

PM Modi: ప్రతీ ఒక్కరూ ఈ ప్రాంతాన్ని సందర్శించాలి.. ప్రజలకు మోదీ పిలుపు
Pm Modi
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 09, 2024 | 2:48 PM

ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల టూర్‌ నేపథ్యంలో ప్రధాని శుక్రవారం సాయంత్రం అస్సాంకు చేరుకున్నారు. ఇందులో భాగంగా అస్సాంలోని తేజ్‌పుర్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఛాపర్‌లో గోలాఘాట్‌ జిల్లాలోని కజిరంగ పార్క్‌కు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి పార్కులోనే ఉన్న ప్రధాని, శనివారం అభయారణ్యాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రధాని జాతీయ పార్క్‌ను సందర్శించి అక్కడ ఏనుగు సఫారీ చేశారు. కెమెరాతో జంతువులను, ప్రృకృతి అందాలను కెమెరాలో చిత్రీకరించారు. 1957 తర్వాత ఈ పార్క్‌ను సందర్శించిన తొలి ప్రధాని మోదీ కావడం విశేషం. అలాగే జీపులో సఫారీ చేశారు. ఈ సమయంలో ప్రధాని వెంట పార్క్‌ డైరెక్టర్‌ సొనాలీ ఘోష్‌, అటవీశాఖ సీనియర్‌ అధికారులున్నారు. సఫారీ చేసిన తర్వాత ప్రధాని మోదీ ఏనుగులకు చెరకు గడలను తినిపించారు. అలాగే మహిళా ఫారెస్ట్‌ గార్డ్‌లతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా దిగిన ఫొటోలను ప్రధాని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. కజిరంగా పార్క్‌ సందర్శన మరుపురానిది అన్న ప్రధాని, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నట్లు రాసుకొచ్చారు. అలాగే స్థానికంగా ఉన్న తేయాకు తోటలను సందర్శిచిన ప్రధాని ఆ ఫొటోలను నెటిజన్లతో పంచుకుంటూ.. ‘అస్సాం అద్భుతమైన తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందింది. అస్సాం టీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచవ్యాప్తంగా అస్సాం ప్రతిష్టను పెంపొందిస్తూ కష్టపడి పని చేస్తున్న టీ గార్డెన్ కమ్యూనిటీని అభినందిస్తున్నాను. పర్యాటకులు అస్సాం రాష్ట్రాన్ని పర్యటించే సమయంలో ఈ తేయాకు తోటలను సందర్శించాలని కోరుతున్నాను’ అని ప్రధాని రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే అస్సాంలో పర్యటనలో భాగంగా జోర్‌హట్‌లో కమాండర్‌ లచిత్‌ బర్ఫుకాన్‌ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. శౌర్యానికి ప్రతీకగా 125 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఇక, రూ.18వేల కోట్ల విలువ కేంద్ర, రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..