BJP Joins: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. బీజేపీలో చేరిన గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన కేంద్ర మాజీ మంత్రి సురేశ్ పచౌరీ, మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన కేంద్ర మాజీ మంత్రి సురేశ్ పచౌరీ, మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.
కాంగ్రెస్ నాయకుడు సురేష్ పచౌరీని ఆ పార్టీ మూడుసార్లు రాజ్యసభకు పంపింది.1990 96 మధ్య రాజ్యసభ సభ్యుడు, రెండోసారి 1996 2002 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2002 నుండి 2008 వరకు మూడోసారి పెద్దల సభకు పంపింది కాంగ్రెస్ పార్టీ. రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
#WATCH | Several Congress leaders, including former Union Minister Suresh Pachouri, join the BJP in Bhopal, Madhya Pradesh.
CM Mohan Yadav, former CM Shivraj Singh Chouhan, state BJP chief VD Sharma and minister Kailash Vijayvargiya present. pic.twitter.com/yNdfHnBK4V
— ANI (@ANI) March 9, 2024
సురేశ్ పచౌరీ రాజకీయ ప్రస్థానం
కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకుడు సురేష్ పచౌరి గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా పేరుంది. పచౌరీ 1981 83లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 1984 85లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1985 88లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 1984 90లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1990లో హోం, రక్షణ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు, 1990 96లో రాజ్యసభ సభ్యుడు, 1995 96లో కేంద్ర రక్షణ ఉత్పత్తి శాఖ సహాయ మంత్రి, 1996 2002 సంవత్సరంలో రాజ్యసభ సభ్యుడు, 2000 సంవత్సరంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ (ప్యానెల్), 2002 2008లో రాజ్యసభ సభ్యుడు, 2004లో చీఫ్ విప్ రాజ్యసభ సభ్యుడు, 2004 2008 మధ్య కాలంలో పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సభ్యులుగా కొనసాగారు. 2008 2011లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు.
కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులందరూ బీజేపీలో చేరుతున్నారని మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం దిక్కులేనిదిగా అభివర్ణించారు. స్వాతంత్ర్యం తర్వాత మహాత్మా గాంధీ కాంగ్రెస్ స్వాతంత్ర్య ఉద్యమమని, కాంగ్రెస్‌ను వెంటనే రద్దు చేయాలని, కొత్త పార్టీ పెట్టుకోవాలని సూచించారన్నారు. కానీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అధికార స్వార్థంతో కాంగ్రెస్‌ను రద్దు చేయకుండా ఉద్యమాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారని ధ్వజమెత్తారు శివరాజ్ సింగ్ చౌహాన్. ‘జవహర్‌లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ కోరికను నెరవేర్చలేదు, కానీ రాహుల్ గాంధీ ఈ కోరికను నెరవేర్చిన తర్వాత మాత్రమే నిట్టూర్పు విడిచిపెడతారు. కాంగ్రెస్ నాయకత్వంతో విసిగిపోయిన వారి ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా బీజేపీలో చేరుతున్నారు అని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..