Dharmendra Pradhan: సమానత్వం, సమగ్రతకు జేఎన్‌యూ నిదర్శనం.. స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(JNU) ఆరో స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇవాళ (మార్చి10)న జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(JNU) ఆరో స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇవాళ (మార్చి10)న జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా మొత్తం 948 మంది విద్యార్థులు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పట్టాలను అందుకున్నారు. ఇదే కార్యక్రమానికి గౌరవ అతిథిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరై కీలకోపన్యాసం చేశారు. ‘భారతదేశంలో 2200 ఏళ్ల క్రితమే ప్రజాస్వామ్యం ఉందన్న కేంద్రమంత్రి భారత ప్రజాస్వామ్య మూలాలపై పరిశోధన చేయాలని జేఎన్‌యూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ‘ ప్రపంచంలో బహుళ వైవిధ్యమున్న విశ్వవిద్యాలయాల్లో జేఎన్‌యూ ఒకటి. భారతదేశం పురాతన నాగరికత, సాంస్కృతిక వారసత్వాన్ని జేఎన్‌యూ ముందుకు తీసుకెళుతోంది. జేఎన్‌యూ అంటేనే వైవిధ్యం, సున్నితత్వం, సమగ్రత, సమానత్వం. ఇక్కడ చదువుకుని ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ సామాజిక జీవితంలో ముఖ్య పాత్రలు పోషించాలి. జేఎన్‌యూ అనేది ఒక విద్యాసంస్థ మాత్రమే కాదు ఒక సంస్కృతి. ఇక భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అంటుంటారు చాలామంది. కానీ ప్రజాస్వామ్యానికి మన దేశం తల్లిలాంటిదని నా అభిప్రాయం. దేశంలోని 130 కోట్ల మంది భారతీయులకు జేఎన్‌యూ విద్యార్థులపై నమ్మకం, గౌరవముంది’
అన్ని రకాల నేపథ్యాల విద్యార్థులు రాణించడానికి సమాన అవకాశం కల్పించడానికి జేఎన్‌యూ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. జేఎన్‌యూ విద్యార్థులు ప్రపంచ పౌరులుగా మారబోతున్నారు. ఇక్కడి సీనియర్లు, టీచర్లు, సిబ్బంది ఇలా అందరూ విద్యార్థుల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తారు’ అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. కాగా ఇదే కార్యక్రమంలో మాట్లాడిన రాష్ట్రపతి ముర్ము మహిళా సాధికారతపై ఆసక్తికర వ్యా్‌ఖ్యలు చేశారు. ఈసారి ఇన్‌స్టిట్యూట్‌లో పురుషుల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని, ఇది సామాజిక మార్పుకు ముఖ్యమైన సూచికగా ఆమె పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..