AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిద్ వ్యాక్సిన్ తీసుకున్న మరో వ్యక్తికి ‘మాగ్నెటిక్ పవర్స్’….కొట్టి పారేసిన కేంద్రం

ఝార్ఖండ్ లో కోవిద్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి తనకు కూడా మాగ్నెటిక్ పవర్స్ (అయస్కాంత ఆకర్షణ శక్తి) కలిగినట్టు చెప్పుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో హజారీ బాగ్ కు చెందిన తాహిర్ అన్సారీ అనే ఈ వ్యక్తి ఈ నెల 12 న తను వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నానని నాసిక్ లో...

కోవిద్ వ్యాక్సిన్ తీసుకున్న మరో వ్యక్తికి 'మాగ్నెటిక్ పవర్స్'....కొట్టి పారేసిన కేంద్రం
Jharkhand Man Claims He Got Magnetic Powers After Taking Covid Vaccine
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 14, 2021 | 4:48 PM

Share

ఝార్ఖండ్ లో కోవిద్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి తనకు కూడా మాగ్నెటిక్ పవర్స్ (అయస్కాంత ఆకర్షణ శక్తి) కలిగినట్టు చెప్పుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో హజారీ బాగ్ కు చెందిన తాహిర్ అన్సారీ అనే ఈ వ్యక్తి ఈ నెల 12 న తను వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నానని నాసిక్ లో ఒక పెద్దమనిషి ఇలాగే రెండో డోసు తీసుకోగానే తన ఒంటికి చెంచాలు, నాణేలు మొదలైనవి అతుక్కుంటున్నట్టు చెప్పిన వీడియో చూశానని అన్నాడు. ఇప్పుడు తాను కూడా పరీక్షించుకోవాలని చూడగా.. తన శరీరానికి కూడా ఈ విధమైన వస్తువులు అతుకున్నట్టు చూసి ఆశ్చర్యపోయానన్నాడు. అయితే ఇతని సమాచారం తెలియగానే ఆరోగ్య శాఖకు చెందిన ఓ బృందం ఇతని ఇంటికి వచ్చి పరీక్షించింది. తాహిర్ శరీరంలో ఏ మాగ్నెటిక్ పవర్ కూడా లేదని వేదరాజన్ అనే డాక్టర్ తెలిపారు. అయినా 48 గంటలపాటు ఇంటిలోనే ఉండాలని, ఇతని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని తన బృందాన్ని ఆదేశించినట్టు చెప్పారు. నాసిక్ వ్యక్తి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు తాహిర్ కూడా వార్తల్లోకెక్కారు.

కానీ వ్యాక్సిన్లలో ఏ మాగ్నెటిక్ పవర్ లేదని, ఇది పూర్తిగా సురక్షితమైనదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వ్యాక్సిన్ తయారీలో లోహపు వస్తువులను ఆక్షర్శించే ఏ పదార్థాలూ ఉండవని పేర్కొంది. మానవ శరీరంలో మాగ్నెటిక్ రియాక్షన్ కి ఏ టీకామందూ కారణం కాదని స్పష్టం చేసింది. మరో రెండు రోజుల్లో తాహిర్ బాడీలో ఈ విధమైన శక్తి ఎలా వచ్చిందో తెలియాల్సి ఉంది. అలాగే నాసిక్ వ్యక్తి ఆరోగ్యాన్ని కూడా పరీక్షిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:  పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.

 భారత్ నుండి బాంగ్లాదేశ్ కు 100 కి.మి నడిచి వెళ్లిన పులి..రేడియో కాలర్ ద్వారా తెలుసుకున్న అధికారులు :Tiger Viral Video.

షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్‌ చేయనున్న నాని..!ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన వైనం :nani act in shortfilm video.

Kaushal Manda funny dance video:బేటీతో కౌశల్ మంద ఫన్నీ డ్యాన్స్‌. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..