Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monuments, Museums Reopen: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. ఈనెల 16 నుంచి తాజ్ మహల్ సహా అన్ని చారిత్రాత్మక ప్రదేశాలు ఓపెన్

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతో.. పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. లాక్‌డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Monuments, Museums Reopen: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. ఈనెల 16 నుంచి తాజ్ మహల్ సహా అన్ని చారిత్రాత్మక ప్రదేశాలు ఓపెన్
All Monuments, Museums Protected Under Asi To Reopen
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 14, 2021 | 4:23 PM

Monuments, Museums Reopen From June 16: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతో.. పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. లాక్‌డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే క్రమంలో తాజ్‌మహల్ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్మారక కేంద్రాలను తెరుస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. జూలై 6 నుంచి అన్ని స్మారక కేంద్రాల్లోకి పర్యాటకులను అనుమతిస్తామని వెల్లడించారు. అయితే, పర్యాటకులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముఖానికి మాస్క్‌ను ధరించడంతో పాటు రెండడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి. పర్యాటకుల సందర్శనకు సంబంధించి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రహ్లాద్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌‌లో భాగంగా భారీగా కేసులు పెరగడంతో అప్రమత్తమైన కేంద్రం.. స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను ఏప్రిల్‌ 15నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో వైరస్‌ కేసులు తగ్గుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌లను సడలిస్తూ సాధారణ జీవనానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు, వ్యాక్సినేషన్‌ కూడా కొనసాగుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జూన్‌ 16 ఈ బుధవారం నుంచి కేంద్ర సంరక్షణలో ఉన్న చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను తిరిగి తెరవాలని నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సందర్శకులు ఆయా చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొన్నారు.

Read Also….  Super-cells to Antibodies: కరోనా వైరస్ తిక్క కుదిర్చే కణాలు ఇవేనట.. మహమ్మారిని అడ్డుకోవడంలో ‘‘టీ సెల్స్’’ క్రియాశీలకం..!

రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధితులకు భారీ పరిహారం!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధితులకు భారీ పరిహారం!
ఇంట్లోనే పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ చేసుకోండి.. రెసిపీ మీ కోసం
ఇంట్లోనే పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ చేసుకోండి.. రెసిపీ మీ కోసం
చాణక్యనీతి : జాగ్రత్త.. ఈ నలుగురు వ్యక్తులకు అప్పు ఇవ్వకూడదంట!
చాణక్యనీతి : జాగ్రత్త.. ఈ నలుగురు వ్యక్తులకు అప్పు ఇవ్వకూడదంట!
1.80 లక్షల మోసపూరిత లింక్‌లను బ్లాక్‌ చేసిన ఎయిర్‌టెల్‌
1.80 లక్షల మోసపూరిత లింక్‌లను బ్లాక్‌ చేసిన ఎయిర్‌టెల్‌
తెలుగు తెరపై కాంతార బ్యూటీ..ఈ అమ్మడుకు లక్కు కలిసొస్తుందా?
తెలుగు తెరపై కాంతార బ్యూటీ..ఈ అమ్మడుకు లక్కు కలిసొస్తుందా?
అలసటను తగ్గించే ఐదు అద్భుతమైన యోగాసనాలు ఇవే !
అలసటను తగ్గించే ఐదు అద్భుతమైన యోగాసనాలు ఇవే !