లోక్ జన శక్తి పార్లమెంటరీ పార్టీ నేతగా పశుపతి కుమార్ పరాస్ ఏకగ్రీవ ఎన్నిక…..ఒంటరైన చిరాగ్ పాశ్వాన్
లోక్ సభలో లోక్ జన శక్తి పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా పశుపతి కుమార్ పరాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ పై ఐదుగురు ఎంపీలు తిరుగుబాటు చేసి.. సభలో తమను ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరిన సంగతి తెలిసిందే.
లోక్ సభలో లోక్ జన శక్తి పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా పశుపతి కుమార్ పరాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ పై ఐదుగురు ఎంపీలు తిరుగుబాటు చేసి.. సభలో తమను ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరిన సంగతి తెలిసిందే. కాగా చిరాగ్ కి బాబాయి (అంకుల్) అయిన పశుపతి కుమార్ పరాస్ ఇక దిగువ సభలో తమ పార్టీ నేత అని వీరంతా ప్రకటించారు. ఈయనతో బాటు చిరాగ్ కి కజిన్ అయిన ప్రిన్స్ రాజ్…ఇంకా చందన్ సింగ్, వీణాదేవి, మెహబూబ్ అలీ కైసర్ కూడా చిరాగ్ కి దూరమయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్ జే పీ ఓడిపోవడంతో అప్పటికే పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న ఈ ఎంపీలు క్రమంగా చిరాగ్ నాయకత్వాన్ని ఈసడించుకున్నారు.
ఈ పార్టీ మాజీ నేత ఒకరు ఆ ఎన్నికల్లో చిరాగ్ తన పార్టీ నేతలను ఛీట్ చేశాడంటూ కేసు పెట్టారు. తాను చేసిన నిర్వాకానికి చిరాగ్ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడని జనతాదళ్-యూ జాతీయ అధ్యక్షుడు ఆర్.సీ. పి. సింగ్ అన్నారు. ఎన్డీయేతో మిత్ర పక్షంగా ఉన్న పార్టీ..ఎల్ జె పీని ఆయన డ్యామేజ్ చేశాడని, అందుకే రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసిందని ఆయన చెప్పారు. ఆ ఎన్నికల్లో చిరాగ్ జెడి-యు అభ్యర్థులందరిపైనా తన పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టారు.
వీరిలో చాలామంది బీజేపీ రెబల్ అభ్యర్థులే.. ఇది ఆయన పార్టీ ఓటమికిదారి తీసిందని జెడి-యూ భావిస్తోంది.ఇక ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవిష్యత్ ఏమిటో తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.
Kaushal Manda funny dance video:బేటీతో కౌశల్ మంద ఫన్నీ డ్యాన్స్. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..