Eatala Meets JP Nadda: తెలంగాణలో బీజేపీ విస్తరణకు కష్టపడి పని చేస్తామన్న ఈటల.. బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాను కలిసిన రాజేందర్
ఇన్నాళ్లు గులాబీ. ఇప్పుడు కమలం. ఫ్లవర్‌నే కాదు పార్టీ రంగును, జెండాను, అజెండాను మార్చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Eatala Rajendar Meets JP Nadda: ఇన్నాళ్లు గులాబీ. ఇప్పుడు కమలం. ఫ్లవర్‌నే కాదు పార్టీ రంగును, జెండాను, అజెండాను మార్చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తొలుత కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో క్రియాశీలక నేత పార్టీలోకి చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన ఈటలకు పుష్పగుచ్చాన్ని అందించిన నడ్డా సాదరంగా అహ్వానించారు.
గత కొన్ని రోజులుగా తెలంగాణలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు నేటితో తెరపడింది. అనుకున్న ముహూర్తానికే తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన అనుచరులు..సన్నిహితులతో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆర్టీసీ యూనియన్ లీడర్ అశ్వత్థామరెడ్డి, గండ్ర నళిని, అందె బాబయ్య తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీలో చేరారు.