Gujarat Elections……2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు…..ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం

2022 లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లకూ తాము పోటీ చేస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 182 సీట్లు ఉన్నాయి. ఒక మోజు పర్యటనకు గాను సోమవారం అహమ్మదాబాద్ కు వచ్చిన ఆయన..

Gujarat Elections......2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.....ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం
Centre Blocks Delhi's Ration Home Delivery Scheme,delhi Ration Home Delivery,cm Aravind Kejriwal,aravind Kejriwal,delhi,centre Blocks Delhi,
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jun 14, 2021 | 3:46 PM

2022 లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లకూ తాము పోటీ చేస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 182 సీట్లు ఉన్నాయి. ఒక మోజు పర్యటనకు గాను సోమవారం అహమ్మదాబాద్ కు వచ్చిన ఆయన..ఇక్కడ బీజేపీ-కాంగ్రెస్ రెండు పార్టీలూ చేతులు కలిపాయని, అందువల్లే ఈ రాష్ట్ర ప్రజలు మరో మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ఢిల్లీలో విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఇవ్వరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. అలాగే 70 ఏళ్లయినా ఈ రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదన్నారు. ఈ స్టేట్ ఇక మారిపోతుందని, గుజరాతీ సోదరులు, సోదరీ మణులను కలుసుకునేందుకు తాను మళ్ళీ వస్తానని ఆయన చెప్పారు. 120 మంది సభ్యులున్న సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 27 సీట్లను గెలుచుకోవడం ద్వారా ఆప్ ఈ రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టింది. అహమ్మదాబాద్ లో తమ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్…గుజరాతీ న్యూస్ ఛానెల్ యాంకర్ ఇసుదాస్ గద్విని తమ పార్టీలో చేర్చుకున్నారు. అతడిని ‘కేజ్రీవాల్ ఆఫ్ గుజరాత్’ గా అభివర్ణించారు.

ఢిల్లీ మోడల్ ను మేము ఈ రాష్ట్రానికి తీసుకురాబోమని. మోడల్ అన్నది ఏ రాష్ట్రానికి అది వేరుగా ఉంటుందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ మోడల్ ని ఇక్కడి ప్రజలే నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. 2022 లో జరిగే గుజరాత్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక ఇక్కడ కూడా తమ పార్టీ కేడర్ ను బలోపేతం =చేయాల్సి ఉందన్నారు. అందుకు ఇప్పటి నుంచే కార్యాచరణకు ఉద్యుక్తులమవుతామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:  పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.

 భారత్ నుండి బాంగ్లాదేశ్ కు 100 కి.మి నడిచి వెళ్లిన పులి..రేడియో కాలర్ ద్వారా తెలుసుకున్న అధికారులు :Tiger Viral Video.

షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్‌ చేయనున్న నాని..!ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన వైనం :nani act in shortfilm video.

Kaushal Manda funny dance video:బేటీతో కౌశల్ మంద ఫన్నీ డ్యాన్స్‌. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!