జార్ఖండ్ ఆరోగ్య మంత్రికి కరోనా పాజటివ్..!

దేశంలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నాగుప్తాకు కరోనా వైరస్ సోకింది. కరోనా లక్షణాల కనిపించడంతో తాను పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలిందని మంత్రి స్వయంగా వెల్లడించారు.

జార్ఖండ్ ఆరోగ్య మంత్రికి కరోనా పాజటివ్..!
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 19, 2020 | 12:57 PM

దేశంలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నాగుప్తాకు కరోనా వైరస్ సోకింది. కరోనా లక్షణాల కనిపించడంతో తాను పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలిందని మంత్రి స్వయంగా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకోవాలని మంత్రి గుప్తా కోరారు. కరోనా సోకిన మంత్రి గుప్తా ఒక రోజు ముందు జరిగిన జార్ఖండ్ మంత్రివర్గ సమావేశంలో కూడా పాల్గొన్నారు. మంత్రి గుప్తాతో సన్నిహితంగా ఉన్న వ్యవసాయశాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్ కు ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆరోగ్యశాఖ మంత్రికే కరోనా సోకడంతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఇతర మంత్రులు క్వారంటైన్ లోకి వెళ్లారు. జార్ఖండులో ఏజేఎస్‌యూ పార్టీ అధ్యక్షుడు సుదేష్ మహతోకు కూడా కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన సుదేష్ హోంక్వారంటైన్ లో కి వెళ్లారు. ప్రజలు కరోనా సోకకుండా సామాజిక దూరం నిబంధనలు పాటించాలని సుదేష్ సూచించారు. ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడుతుండడంతో నేతలు ఆందోళనకు గురవుతున్నారు.