ఆ బస్సు యజమాని ఇకలేడు..

యూపీలో జరిగిందో విచిత్రం ! 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును ఓ ఫైనాన్స్ కంపెనీకి చెందిన రీకవరీ ఏజంట్లు 'హైజాక్' చేశారు. కారణం ? ఆ బస్సు యజమాని ఈ వాహనం కోసం తాను తీసుకున్న రుణాన్ని తిరిగి ఈ కంపెనీకి చెల్లించలేకపోవడమేనట !

ఆ బస్సు యజమాని ఇకలేడు..
Follow us
Umakanth Rao

| Edited By: Ravi Kiran

Updated on: Aug 19, 2020 | 1:27 PM

యూపీలో జరిగిందో విచిత్రం ! 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును ఓ ఫైనాన్స్ కంపెనీకి చెందిన రీకవరీ ఏజంట్లు ‘హైజాక్’ చేశారు. కారణం ? ఆ బస్సు యజమాని ఈ వాహనం కోసం తాను తీసుకున్న రుణాన్ని తిరిగి ఈ కంపెనీకి చెల్లించలేకపోవడమేనట ! దాంతో ఈ కంపెనీ  ఏజంట్లు దీని మీద ‘పడ్డారు’.. హర్యానాలోని గుర్ గావ్ నుంచి గ్వాలియర్ వెళ్తున్న ఈ వాహనాన్ని అడగించి దారి మళ్లించారు. ఈ బస్సులో కల్లాకపటం తెలియని పిల్లలు కూడా కొందరు ఉన్నారు. ఇక బస్సు నుంచి దిగిన ముగ్గురు వ్యక్తులు..రికవరీ ఏజంట్ల నిర్వాకాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. అయితే ఈ బస్సు డ్రైవర్, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, ఏజంట్లపై కేసు పెట్టామని వారు తెలిపారు. ఇంతా చేస్తే.. బస్సు యజమాని నిన్న మరణించాడట..!