‘జేఈఈ మెయిన్’ అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి…
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది....
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ (JEE) మెయిన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NIT) విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన జేఈఈ మెయిన్- ఏప్రిల్ పరీక్షలు వచ్చే నెల 1 నుంచి 6 వరకు జరగనున్నాయి. అదేవిధంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అందులో వారి ఆరోగ్య పరిస్థితి, ఈమధ్య కాలంలో వారు ప్రయాణించిన వివరాలను అందులో వెల్లడించాలి.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించకూడదని కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పరీక్షల వాయిదాకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం, పరీక్షలను షెడ్యూల్ ప్రకారం ఎధావిధిగా నిర్వహించాలని తీర్పునిచ్చింది. దీంతో జేఈఈ మెయిన్ సెప్టెంబర్ 1-6 వరకు, నీట్ యూజీ సెప్టెంబర్ 13న జరగనున్నది.
అయితే.. జేఈఈ(JEE) కి దరఖాస్తు చేసుకున్నవారు అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/webinfo/public/home.aspx ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.