ఈ ఆకులు ఉండగా.. హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు దండగ.. వంద రోగాలు పరార్
ప్రస్తుతం జీవనశైలిలో ఆహారాన్ని టైంకి తినడమే మానేశారు. దీని వలన రక రకాల సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి వాటికీ మెడిసిన్స్ వాడటం కన్నా నేచురల్ గానే తగ్గించుకోవచ్చు. వాటిలో ఈ ఆకులు బాగా పని చేస్తాయి. మీరు కూడా వీటిని తిని మీ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేయండి.

ప్రస్తుతం రోజుల్లో అందరూ ఎవరు పనుల్లో వారు చాలా బిజీగా ఉన్నారు. కొందరికి పని ఒత్తిడి వలన ఫుడ్ సరిగా తినరు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో అందరూ ఎదుర్కొంటున్న సమస్య జీర్ణక్రియ పనితీరు మందగించడం. పనిలో పడి ఇంట్లో చేసుకుని తినే సమయం లేక బయట లభించే ఫాస్ట్ ఫుడ్స్ , ఆయిల్ ఫుడ్స్, మొబైల్ ఎక్కువగా వాడటం ఇలాంటి అలవాట్ల వలన జీర్ణవ్యవస్థ పాడయ్యే అవకాశం ఉంది. ఇవి మాత్రమే కాకుండా గ్యాస్, కడుపు నొప్పి, నిద్ర లేమి వంటి సమస్యలు ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది.
జీర్ణవ్యవస్థ
బయట ఫుడ్స్ తినడం వలన కొందరికి విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. తిన్న ఫుడ్స్ జీర్ణం కాకపోతే శరీరానికి తగిన పోషకాలు సరిగా అందకుండా పోతాయి. దాని వలన ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇంకా నీరసం, వాంతులు వంటి సమస్యలు కూడా వస్తాయి. దీని కోసం మీరు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గర దొరికే తమలపాకును తింటే చాలు. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
తమలపాకు జ్యూస్ రూపంలో కానీ నమలడం వలన కానీ జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. నిజం చెప్పాలంటే ఇది మంచి మెడిసిన్. తమలపాకును నోటిలోవేసుకున్నప్పుడు లాలాజలం వస్తుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయం చేస్తుంది. ఇప్పటికి ఊర్లలో ఈ ఆకులు కనిపిస్తే చాలు నోట్లో వేసుకుని నములుతూనే ఉంటారు.ఎందుకంటే, దీనిలో సహజ సుగంధ ద్రవ్యాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎంతటి నొప్పిని అయినా ఇట్టే తగ్గిస్తాయి. ఇంకా ఇవి వాత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. కాబట్టి, వీటిని ఇప్పటి నుంచి తినడం అలవాటు చేసుకోండి. మొదట్లో చేదుగా ఉన్నా తినగా తినగా మంచి టేస్ట్ వస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
